Vadde Venkat

Directions

Vadde Venkat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vadde Venkat, Political organisation, Puttaparthi.

Leader at Telugudesam Party
🏛️ 𝐂𝐡𝐚𝐢𝐫𝐦𝐚𝐧, 𝐔𝐦𝐦𝐚𝐝𝐢 𝐀𝐧𝐚𝐧𝐭𝐚𝐩𝐮𝐫𝐚𝐦 𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭 𝐋𝐢𝐛𝐫𝐚𝐫𝐲 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧 🖋️
━━━━━ 📖
చైర్మన్ ◈ ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ 🏛️ 📖
టిడిపి వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్

జయహో బీసీ!​జనాభాలో సగం - కూటమి ఇచ్చింది బలం: జనాభాలో సగభాగంగా ఉన్న బీసీలకు మిశ్రా కమిషన్ సిఫారసుల ప్రకారం పూర్తి న్యాయం ...
12/10/2026

జయహో బీసీ!
​జనాభాలో సగం - కూటమి ఇచ్చింది బలం: జనాభాలో సగభాగంగా ఉన్న బీసీలకు మిశ్రా కమిషన్ సిఫారసుల ప్రకారం పూర్తి న్యాయం చేయడమే కూటమి లక్ష్యం.
​వైకాపా అడ్డంకులు: గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే జగన్ మోహన్ రెడ్డి కోర్టుల ద్వారా వాటిని అడ్డుకున్నారని విమర్శించారు.
​కొత్త హామీ: ఇప్పుడు కేవలం 34% కాదు, ఏకంగా 40% శాతం సీట్లు/ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబుగారు స్పష్టం చేశారు.
​రాజకీయ పిలుపు: 'గొడ్డలి పార్టీ' పూర్తిగా మూతపడిపోయేలా కూటమి అభ్యర్థుల విజయం ఘనంగా ఉండాలని అధినేత పిలుపునిచ్చారు.

ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు: అనంతపురం జిల్లా గ్రంథాలయాల్లో వెంకయ్య నాయుడు గారి జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరణ​అలుపెరు...
12/10/2026

ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు: అనంతపురం జిల్లా గ్రంథాలయాల్లో వెంకయ్య నాయుడు గారి జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరణ
​అలుపెరుగని ప్రయాణం, జాతికి స్ఫూర్తి ప్రదాత అయిన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి జీవిత చరిత్ర పుస్తకం ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లోనూ అందుబాటులోకి వచ్చింది.
​"పదవీ విరమణ చేశాను కానీ... పెదవీ విరమణ చెయ్యలేదు" అన్న శ్రీ వెంకయ్య నాయుడు గారి స్ఫూర్తిదాయక మాటలను ఆచరిస్తూ, నవత మరియు యువత కోసం ఆయన చేసిన సేవలను భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
​ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరియు కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ వడ్డే వెంకట్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని, జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో ఈ పుస్తకం ఉండేలా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
​యువత, విద్యార్థులు మరియు పాఠకులు ఈ గొప్ప పుస్తకాన్ని చదివి, ఆయన జీవితం నుండి స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాము

కళ్యాణదుర్గంలో వడ్డెర కమ్యూనిటీ హాల్ భూమి పూజకు ఆహ్వానం​కళ్యాణదుర్గం:కళ్యాణదుర్గం పట్టణంలో నూతనంగా నిర్మించతలపెట్టిన వడ్...
10/10/2026

కళ్యాణదుర్గంలో వడ్డెర కమ్యూనిటీ హాల్ భూమి పూజకు ఆహ్వానం
​కళ్యాణదుర్గం:
కళ్యాణదుర్గం పట్టణంలో నూతనంగా నిర్మించతలపెట్టిన వడ్డెర కమ్యూనిటీ హాల్ భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం సోమవారం వైభవంగా జరగనుంది.
​ఈ సందర్భంగా, ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ వడ్డే వెంకట్ గారిని కళ్యాణదుర్గం వడ్డెర సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
​ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీ ఆమిలేని సురేంద్రబాబు మరియు అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ ల ప్రత్యేక నిధులతో చేపట్టడం జరుగుతోంది. వడ్డెర సమాజ సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేసిన ప్రజాప్రతినిధులకు వడ్డెర సంఘం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
​ఈ ఆహ్వాన కార్యక్రమంలో కళ్యాణదుర్గం వడ్డెర సంఘం నాయకులు నాగరాజు, రామకృష్ణ, K. నాగరాజు, K. గోవిందప్ప, శీను తదితరులు పాల్గొన్నారు. సోమవారం జరగబోయే ఈ భూమి పూజ కార్యక్రమానికి వడ్డెర సంఘం నాయకులు, సంఘ సోదరులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

08/10/2026
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రంథాలయాలకు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోటీ పరీక్షల (APPSC గ్రూప...
07/10/2026

ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రంథాలయాలకు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోటీ పరీక్షల (APPSC గ్రూప్-1, గ్రూప్-2 తదితర) నోటిఫికేషన్లు విడుదల చేసిన నేపథ్యంలో, నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక చర్యలు చేపట్టారు.

ఉమ్మడి అనంతపురం గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వడ్డే వెంకట్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

పుస్తకాల పంపిణీ: జిల్లాలోని అన్ని మండలాల గ్రంథాలయాలకు పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను ఆయా గ్రంథాలయ అధికారులకు పంపిణీ చేశారు.
చైర్మన్ మరియు కార్యదర్శి సూచనలు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకునేలా, ప్రతి మండలంలోని లైబ్రేరియన్లు స్థానిక నాయకులు లేదా అధికారులతో కలిసి ఈ పుస్తకాలను ఆవిష్కరించి నిరుద్యోగులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.
పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీ శివ ప్రసాద్ గారితో పాటు గ్రంథాలయ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తెలుగు నేల విప్లవ పోరాటంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయక బ్రిటిష్ పాలకులపై పోరాడిన ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు, వడ్డెర జాత...
06/10/2026

తెలుగు నేల విప్లవ పోరాటంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయక బ్రిటిష్ పాలకులపై పోరాడిన ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు, వడ్డెర జాతి ముద్దుబిడ్డ వడ్డే ఓబన్న గారి 180 వ వర్ధంతి సందర్భంగా ఆ అమరవీరుడికి నా హృదయపూర్వక నివాళులు. ఆయన ఆశయాలు మన అందరికీ ఎల్లప్పుడూ మార్గదర్శకం!

పల్లెల ప్రగతికి కూటమి ప్రభుత్వం నిబద్ధత! ☀️🚩​మడకశిర శాసనసభ్యులు, TTD బోర్డు సభ్యులు, శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార...
05/10/2026

పల్లెల ప్రగతికి కూటమి ప్రభుత్వం నిబద్ధత! ☀️🚩
​మడకశిర శాసనసభ్యులు, TTD బోర్డు సభ్యులు, శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఎం.ఎస్. రాజు గారి స్వగ్రామమైన శింగనమల నియోజకవర్గం, అలంకరాయునిపేట (అలంకానపల్లె) లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మహోత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. 🏗️✨
​ఈ కార్యక్రమానికి పలువురు గౌరవ శాసనసభ్యులు (MLAs), మంత్రులు (Ministers), శాసనమండలి సభ్యులు (MLCs) లతో కలిసి ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ వడ్డే వెంకట్ గారు శంకుస్థాపన ప్రోగ్రాంలో పాల్గొన్నారు
​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు, పల్లెల సమగ్ర ప్రగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
​ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం-కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు! 🎉
​

ఈ రోజు తంబలపల్లె నియోజకవర్గ నాయకులు నన్ను మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 8వ తేదీన అంగళ్లు లోని విశ్వం కాలేజ్ సర్కిల్ వద్ద ...
04/10/2026

ఈ రోజు తంబలపల్లె నియోజకవర్గ నాయకులు నన్ను మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 8వ తేదీన అంగళ్లు లోని విశ్వం కాలేజ్ సర్కిల్ వద్ద నిర్వహించనున్న మహనీయుడు శ్రీ వడ్డే ఓబన్న గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.
​నాపై అభిమానంతో వచ్చి ఆహ్వానించిన నాయకులు, సోదరులు P. సురేంద్ర, D. నారాయణ, D. చంద్ర, K. రాణా ప్రతాప్, D. రెడ్డప్ప, D. రామలక్షుము, M. శ్రీనివాసులు, K. నాగ మల్లప్ప గార్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
​సమాజ సేవకుడు, మహనీయుడైన శ్రీ వడ్డే ఓబన్న గారి స్మారకార్థం చేపడుతున్న ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ, నియోజకవర్గ ప్రజలకు మరియు బంధుమిత్రులకు ముందస్తు శుభాకాంక్షలు! 🙏💐
​

Address

Puttaparthi

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadde Venkat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share