Palle Raghunatha Reddy

Directions Website

Palle Raghunatha Reddy పుట్టపర్తి నియోజకవర్గం

06/09/2026

గురువులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో విద్యాశాఖ మంత్రిగా రెండేళ్లలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. మంచి ఫలితాలు సాధించాం. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించాం. నేను బాధ్యతలు చేపట్టే నాటికి దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత శాతం ఉన్న మన రాష్ట్రం ఇప్పుడు 10% పెరిగింది. సమాజ భాగస్వామ్యంతో త్వరలోనే 100% అక్షరాస్యత సాధిస్తాం.

పుట్టపర్తి నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని త్రాగునీటి అవసరాల కోసం ...
27/08/2026

పుట్టపర్తి నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని త్రాగునీటి అవసరాల కోసం రూ.4 కోట్ల 12 లక్షల నిధులను జిల్లా పరిషత్ ద్వారా మంజూరు చేసి సహాయ సహకారాలు అందించాలని జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి గారిని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి గారు ప్రత్యేకంగా కోరారు.

ఈ సమవ్సంలో హిందూపురం ఎంపీ పార్థసారథి గారు , ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్ గారు,ఎమ్మెల్సీ రమాదేవి గారు , డీసీఎంఎస్ ఛైర్మన్ వెంకటరాముడు గారు,ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

27/08/2026

*మారాల రిజర్వాయర్ కు హంద్రీ నీవా కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన* *పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి గారు, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు *

26/08/2026

పెద్దకమ్మవారిపల్లిలో జరిగిన టీడీపీ నాయకులు గూడూరు నాగేంద్ర ,చెన్నమ్మ కుమారుడు చిన్నారి హర్ష జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు , మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే. రత్నాకర్ గారు హాజరై చిన్నారి హర్ష కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

రేయింబవళ్లు కష్టపడి చదివాను.. నా కష్టానికి ఫలితంగా మెగా డీఎస్సీలో ఒకేసారి మూడు టీచర్ పోస్టులు మెగా డీఎస్సీలో ఫస్ట్ ర్యాం...
26/08/2026

రేయింబవళ్లు కష్టపడి చదివాను.. నా కష్టానికి ఫలితంగా మెగా డీఎస్సీలో ఒకేసారి మూడు టీచర్ పోస్టులు

మెగా డీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ సాధించి ఇంగ్లీష్ టీచర్ ఉద్యోగం పొందిన కొత్తచెరువు నివాసి మాధవి ఇంటికి పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి గారు , మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. మాధవి భుజం తట్టి ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసించారు.

అదేవిధంగా మెగా డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సాధించిన నవ్యశ్రీ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు , మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

రేయింబవళ్లు కష్టపడి చదివాను.. నా కష్టానికి ఫలితంగా మెగా డీఎస్సీలో ఒకేసారి మూడు టీచర్ పోస్టులు సాధించానని డీఎస్సీ ఫస్ట్ ర్యాంకర్ ఇంగ్లీష్ అసిస్టెంట్ మాధవి తెలిపారు. డబ్బులు పెడితే ఒకేసారి మూడు పోస్టులు వస్తాయా? అని ప్రశ్నించారు. కష్టపడి చదవడం, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించడం వల్లే తన కల సాకారమైందని ఆమె పేర్కొన్నారు.

మెగా డీఎస్సీ నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటామని మాధవి అన్నారు.

మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి నివాసానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కే. నారాయణ గారు అనంతపురం నగరంల...
26/08/2026

మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి నివాసానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కే. నారాయణ గారు

అనంతపురం నగరంలోని పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి నివాసానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కే. నారాయణ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి గారు , పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి గారు , మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా డాక్టర్ కే. నారాయణ గారికి పల్లె కుటుంబ సభ్యులు పుష్పగుచ్చం అందించి శాలువతో సన్మానించి సత్కరించారు.

అదేవిధంగా ఉమ్మడి ఏపీ లో పనిచేసిన మాజీ డీజీపీ గోపీనాథ్ రెడ్డి గారు, కుటుంబ సభ్యులు కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి గారు ,పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి గారు , కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల సిపిఐ కార్యదర్శులు నారాయణ స్వామి ,వేమయ్య యాదవ్ , తదితరులు పాల్గొన్నారు.

నిరంతరం ప్రజాసేవలో ముందంజలో ఉండే మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర విద్యా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మరియు శ్రీమతి ...
26/08/2026

నిరంతరం ప్రజాసేవలో ముందంజలో ఉండే మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర విద్యా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మరియు శ్రీమతి నారా బ్రాహ్మణి గారికి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని... ప్రజా జీవితంలో మరింత ఉన్నతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.


*బళ్లారి జిందాల్ ఎయిర్‌పోర్టులో నారా లోకేష్‌ గారికి ఘన స్వాగతం*  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మం...
26/08/2026

*బళ్లారి జిందాల్ ఎయిర్‌పోర్టులో నారా లోకేష్‌ గారికి ఘన స్వాగతం*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి మంగళవారం బళ్లారి పర్యటన సందర్భంగా జిందాల్ విజయనగర ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి.

ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి గారు , మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు , అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు , హిందూపురం ఎంపీ పార్థసారథి గారు , అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు , ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు జిందాల్ విజయనగర ఎయిర్‌పోర్టుకు చేరుకొని పుష్ప గుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు.

రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల ఆస్తులకు కూటమి ప్రభుత్వ భద్రతఓడి చెరువు మండలం తుమ్మలకుంట్లపల్లిలో సుమారు  608 మంది రైతులకు...
08/06/2026

రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల ఆస్తులకు కూటమి ప్రభుత్వ భద్రత

ఓడి చెరువు మండలం తుమ్మలకుంట్లపల్లిలో సుమారు 608 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ, మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను భద్రపరచడం కోసమే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నారని తెలిపారు.

08/06/2026

ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాను పూర్తిగా ఎత్తేయాలని జగన్ చూస్తున్నాడా?

ఇదే స్పోర్ట్స్ కోటాలో జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాకు సచివాలయంలో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు అదే స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీలో ఉద్యోగం వచ్చింది. ఆ రోజు తప్పు కాని స్పోర్ట్స్ కోటా, ఈ రోజు తప్పు ఎలా అవుతుంది?



Address

Main Road
Puttaparthi

Alerts

Be the first to know and let us send you an email when Palle Raghunatha Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share