CITU Repalle

Directions

CITU Repalle CITU

15/09/2026

రేపల్లె .. #ఉద్యోగ, #ఉపాధ్యాయ, #కార్మిక, #ప్రజాసమస్యలపై #శాసనమండలిలో #మాట్లాడే #గొంతుక,నీతి,నిజాయితీగా ఉండే ఉమ్మడి గుంటూరు,కృష్ణ జిల్లాల #ఉపాధ్యాయ #అభ్యర్థి ుమంతరావుగారి, #పరిచయ #కార్యక్రమం #రేపల్లెలో, నాగిశెట్టి మధు కళ్యాణ మండపంలో జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సీహెచ్.మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ,ప్రవేట్ ఉపాధ్యాయ, లెక్చరర్లు,పెన్షనర్స్ ఉపాధ్యాయ ఓటర్లు అందరు పీడీఎఫ్ నీ బలపరచాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ MLC బొడ్డు.నాగేశ్వరరావు,UTF జిల్లా,సీనియర్ నాయకులు కే.సాయిప్రసాద్,గాదె. సుబ్రమణ్యేశ్వరరావు,అడుగుల. శ్రీనివాసరావు,కె.వినయ్ కుమార్, జి.శాంతారావు, ఎంవి.సుబ్రహ్మణ్యం,CITU, DYFI,ఇతర ప్రజాసంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

15/09/2026
15/09/2026
11/09/2026

రేపల్లె #దేశవ్యాప్తంగా #బ్యాంకుఉద్యోగులసమ్మె, #రేపల్లెలో #సిఐటియు #మద్దతు...* కేంద్ర ప్రభుత్వంతో బ్యాంకు ఉద్యోగులా యూనియన్స్ కి జరిగిన ఒప్పందాలను ఆమోదించాలని,UFBU(యునైటెడ్ పోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్స్) ఇచ్చిన సమ్మెలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. రేపల్లె ఎస్బిఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద అన్ని యూనిట్స్ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం రేపల్లె సెక్రటరీ రంజిత్ కుమార్, సీనియర్ ఉద్యోగులు గురు ప్రసాద్ లు మాట్లాడుతూ వారంలో 5 రోజుల పని దినాలు బ్యాంకింగ్ కోసం జరిగిన ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి,బ్యాంకుల వారీ సాధించిన ఫలితాలను బట్టి ఆ బ్యాంకులో క్రింది నుండి పై దాకా పనిచేసే ఉద్యోగులందరికీ పిఎస్ఐ బెనిఫిట్స్ అమలుచేయాలి,కానీ ప్రభుత్వం కేవలం కొంతమంది పై స్థాయిలో ఉండే అధికారులకు మాత్రమే పరిమితం బెనిఫిట్స్ పరిమితం చేస్తుంది,మిగతా 95శాతం మందిని స్కీం నుండి మినహాయిస్తూ ఆదేశాలు ఇవ్వటం వల్ల అనేకమంది మోసపోతున్నారు,పెన్షన్ స్కీమ్ మార్పుల వల్ల పెన్షన్స్ కోల్పోతున్నారు అని అన్నారు,న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28 నుండి 30 వరకు,అప్పటికీ ప్రభుత్వ స్పందన లేకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని అన్నారు.*సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ* బ్యాంకులు సాధించిన ఫలితాల్లో కొంతమంది ఉద్యోగులకి మాత్రమే ఫలితం వచ్చేలాగా తీసుకొచ్చిన ఆర్డర్స్ వల్ల ఉద్యోగుల మధ్య విభజన పెరగటం వల్ల బ్యాంకింగ్ సెక్టార్ కి నష్టం అని,ఉద్యోగుల ఐక్యతను కాపాడుకోవడానికి,న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సిఐటియు పూర్తిగా మద్దతు ఇస్తున్నామన్నారు,కేంద్రప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి వాటిని ప్రైవేటీకరించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలను బ్యాంకు ఉద్యోగులు ప్రజల సాయంతో తిప్పికొట్టాలి అన్నారు,ప్రభుత్వం లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చి ఉద్యోగులను నోరు మెదపకుండా చేసి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడటానికి జరుగుతున్న పోరాటంలో అందరూ ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పలు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ స్వామి రామకృష్ణ,దుర్గ,హిమజా, సుజాత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

10/09/2026

రేపల్లె #డప్పుకళాకారుల ₹పెన్షన్ ను #సెల్ఫ్ #డిక్లరేషన్ తో #నమోదుచెయ్యాలి,పెన్షన్స్ #అర్జీలుసమయంపెంచాలి, అర్హులైన అందరికీ అందాలంటే నిరంతరం ప్రక్రియగా ఉండాలి... #సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ డిమాండ్..
రేపల్లె మండలం ఇంచార్జ్ ఎంపీడీవో గారికి స్థానికంగా ప్రధానంగా డప్పు కళాకారులు, చెప్పులు కుట్టుకునే వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా సెల్ఫ్ డెకరేషన్ చాలు అన్న జీవో కాపీ జత చేసి,పెన్షన్స్ అర్జీలు లబ్ధిదారులకు వస్తున్నా సమస్యలు పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా *సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ* 2 సంవత్సరాలు తర్వాత పెన్షన్స్ అర్జీలు సేకరిస్తున్న ప్రభుత్వం,కేవలం 10 రోజులు వ్యవధితో అర్జీలు ప్రక్రియ పూర్తయిలాగా సెప్టెంబర్ 16వ తేదీ వరకు అని ప్రకటించడం,వరుస సెలవులు రావడంతో అనేకమంది అవసరమైన కాగితాల కోసం, ఆన్లైన్ సమస్యల వల్ల సచివాలయాలు చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారు.ఇది స్థానిక సంస్థల ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటించడం,వల్ల నిజమైన లబ్ధిదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు,2 సంవత్సరాలు నుండి భర్త చనిపోయిన వితంతు కుటుంబాలు,ప్రమాదాల్లో అంగవైకల్యం పొందినటువంటి వికలాంగులు,60 సంవత్సరాలు దాటిన వృద్ధులు,ఒంటరి మహిళలు ఎదురుచూసి ఇప్పుడు తమ పెన్షన్ వస్తుందో,రాదో అని ఆందోళన చెందాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు, ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పెన్షన్స్ అర్జీలు ప్రక్రియ నిరంతరం జరగాలి. డప్పు కళాకారుల,చెప్పులు కొట్టుకునే వృతిదారుల పెన్షన్ కి సంబంధించి ప్రభుత్వం సోషల్ వెల్ఫే డైరెక్టర్ నిర్దిష్టంగా సెల్ఫ్ డిక్లరైజేషన్ ద్వారా అర్జీలు తీసుకోవాలని చెప్పినప్పటికీ,రేపల్లె నియోజకవర్గ మొత్తంగా కూడా సచివాలయాల్లో సిబ్బంది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఐడి కార్డులు తీసుకురండి,నోటరీ చేయించండి అంటూ తిప్పి పంపించడంతో అనేకమంది నోటరీ ఆఫీసులు,సంక్షేమ సొసైటీలు వద్ద కాగితాల కోసం,రేపల్లె తాలూకా చుట్టు 500 నుండి 2000 రూపాయలు ఖర్చు పెడుతూ తిరుగుతున్నట్లు అసలు ఏ కాగితం ఎవరిస్తారు అర్థం కాని పరిస్థితిని లబ్ధిదారులు వాపోతున్నారు,కావున 2019లో ఇచ్చిన నిబంధనల ప్రకారమే సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా డప్పు కళాకారులకి,చర్మకారులకి పెన్షన్ నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని ఆ రకంగా మండల స్థాయిలో అధికారులు మానిటరింగ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రేపల్లె కమిటీ నేతలు కొప్పుల.గోపి,కే.ఆశీర్వాదం, డి.అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు

09/09/2026

రేపల్లె టౌన్ #ఎన్టీఆర్ నగర్ #పాతజగన్ #కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న #తక్షణసమస్యలు #పరిష్కరించాలి ...రోడ్లమీద, ఖాళీస్థలాలులో పెరిగినా రెల్లినీ నిర్మూలించాలి,వెలగని వీధిలైట్ల స్థానంలో కొత్త లైట్లు వేయాలి, రోడ్లు నిర్మాణం పనులు ప్రారంభించాలినీ కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం*. ....కాలనీ అభివృద్ధి కమిటీగా స్థానికంగా కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని రేపల్లె మున్సిపల్ కమిషనర్ కే.సాంబశివరావు గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా *కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షులు,సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ* ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు కట్టుకోండి,అంటూఒత్తిడి చేయడం వల్ల అనేక మంది ఇళ్ళు నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్న పాత జగన్ కాలనీలో మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మట్టిరోడ్లు కావడంతో వర్షాలు వల్ల నడిచే రోడ్ల పక్కన,రోడ్డు మీద విపరీతంగా రెల్లి మొక్కలు, ముళ్ళ చెట్లు పెరిగినవి,ఖాళీ ప్లాట్లులో కూడా రెల్లి పెరిగింది.నడవడానికి ఇబ్బందితో పాటు పాములు పెద్ద ఎత్తున ఇళ్లల్లోకి వస్తున్నవి. తక్షణం రెల్లి తొలగించాలి.50 నుండి 70 స్తంభాలకు వరకు ఈ 2నెలల కాలంలో వీధిలైట్లు వెలగకపోవడం వల్ల రాత్రిపూట అనేక బజార్లు చీకటిమయమైనవి,తక్షణం పాడైన వీధిలైట్లు స్థానంలో కొత్త లైట్లు వేయాలి,రోడ్లు నిర్మాణం పనులు ప్రారంభించాలి,డోర్ నెంబర్లు కేటాయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ (జగన్ కాలనీ) అభివృద్ధి కమిటి కో కన్వీనర్ కే.రవికుమార్,ఐద్వా (అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం)రేపల్లె పట్టణ అధ్యక్షురాలు ఎస్ కే.షకీరా,అభివృద్ధి కమిటీ సభ్యులు కే. వీరాంజనేయులు,నాగమల్లేశ్వరరావు, కె.సింధుదేవి,గౌసే,వెంకటేశ్వరరావు,సిపిఎం నాయకులు కే.ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు

07/09/2026

#సెప్టెంబర్ 17,18 #రేపల్లెలో #ఆశావర్కర్స్ #యూనియన్ #బాపట్లజిల్లా #శిక్షణతరగతులు #జయప్రదంకోసం #పోస్టర్స్ #ఆవిష్కరణ ఈరోజు సిఐటియు రేపల్లె కార్యాలయంలో రేపల్లె నియోజకవర్గం స్థాయి ఆశ వర్కర్స్ యూనియన్ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు ఎన్.సునంద అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఆశవర్కర్స్ యూనియన్ రేపల్లె నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు,సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కింద స్థాయిలో పేదలకు ఆశావర్కర్ల మానవత దృక్పథంతో కొవిడ్ లాంటి సమయంలో కూడా తమ ప్రాణాలను ఫణంగా కింద స్థాయిలో వైద్య సేవలు అందించారు. కానీ ఆశ వర్కర్లకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు,ఈ సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం దేశవ్యాప్తంగా యూనియన్ గా పోరాటాలు జరుగుతున్నవి.బాపట్ల జిల్లా స్థాయిలో ఆశావర్కర్స్ యూనియన్ గా దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పులు,కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రైవేటీకరణ విధానాలు నేపథ్యంలో భవిష్యత్తులో ఆశా వర్కర్స్ యూనియన్ గా నిర్వహించనున్న పోరాటాలకు సన్నద్ధం కావటానికి సెప్టెంబరు 17,18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులకు రేపల్లె పట్టణంలో కాటూరి. సీతారామయ్య ఫంక్షన్ హాల్ లో జరుగునున్న శిక్షణా తరగతులు జయప్రదం చేయాలని అన్నారు.ఈ సన్నాహక సమావేశం,పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గంలోని ఆశ వర్కర్స్ యూనియన్ నాయకత్వం,సిఐటియు రేపల్లె పట్టణ కన్వీనర్ కే.ఝాన్సీ,జిల్లా కమిటీ సభ్యులు ఎన్.సునంద, ఏం.దానమ్మ,సిహెచ్.వీరలక్ష్మి,కే.కీర్తి, కే.పావని,వై.వరలక్ష్మి,ఎన్.ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Address

Repalle

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU Repalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category