29/12/2023
for scrolling/publication :
నిస్సహాయులకు దుప్పట్లను పంపిణీ చేసిన పద్మారావు గౌడ్
+ సెర్వింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆద్వర్యంలో కార్యక్రమం
సికింద్రాబాద్ : సితాఫలమండీ ప్రాంతానికి చెందిన సెర్వింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు కోనేటి శ్వేత శ్రీ (పింకి) ఆద్వర్యంలో సికింద్రాబాద్ పరిధిలో రోడ్ల పై నిద్రించే వృద్దులు, అసహయులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం బుధవారం అర్ధరాత్రి జరిగింది. సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని చిలకలగుడా, భోయిగుడా, పద్మారావు నగర్ తదితర ప్రాంతాల్లో వంద మంది అసహయులకు దుప్పట్లు, మాస్కులు, ఆహార ప్యాకిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకొనేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ గా పద్మారావు గౌడ్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని తమ ఫౌండషన్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఫౌండర్, ప్రెసిడెంట్ కోనేటి శ్వేత శ్రీ (పింకి) ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్పొరేటర్ సామల హేమ, ఫౌండేషన్ ప్రతినిధిలు సంగీతా, పవిత్ర, అర్చన, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.

26/09/2023
31/03/2022
26/08/2021
17/06/2021
16/06/2021
13/06/2021