Rajanna Sircilla District Police

Directions Website

Rajanna Sircilla District Police సత్యమేవ జయతే

మహిళల భద్రతే ధ్యేయం... షీ టీమ్ ఎల్లప్పుడూ మీతోనే.జిల్లాలో మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రత కోసం షీ టీమ్ నిరంతరం అప్ర...
09/10/2026

మహిళల భద్రతే ధ్యేయం... షీ టీమ్ ఎల్లప్పుడూ మీతోనే.

జిల్లాలో మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రత కోసం షీ టీమ్ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోంది.

మహిళ భద్రతకు భరోసా కల్పిస్తూ జిల్లాలో గుర్తించిన హాట్‌స్పాట్స్ వద్ద షీ టీమ్ మఫ్టీలో నిఘా కొనసాగిస్తోంది.

మహిళలు, విద్యార్థినుల్లో చైతన్యం కల్పించేందుకు షీ టీమ్ బృందాలు మహిళలు పనిచేసే ప్రదేశాలను సందర్శించి మహిళల రక్షణ, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, పోక్సో చట్టం తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

వేధింపులు, ఈవ్‌టీజింగ్, వెంబడింపులు ఎదురైతే వెంటనే 📞 8712656425 కు ఫిర్యాదు చేయండి.
Telangana State Police
Women Safety Wing Telangana State Police


విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందిస్తూ, వారిని ఉన్నత లక్ష్యాల సాధన దిశగా నడిపించడంలో ఉపా...
09/10/2026

విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందిస్తూ, వారిని ఉన్నత లక్ష్యాల సాధన దిశగా నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం.

విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ, వారి భద్రత, సైబర్ అవగాహనకు ప్రాధాన్యతనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలి.

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు తెలపడం జరిగింది.
Telangana State Police

చిన్నారులకు సంబంధించిన లైంగిక అసభ్యకర వీడియోలను (చైల్డ్ పోర్నోగ్రఫీ) వీక్షించినా, డౌన్‌లోడ్ చేసినా, షేర్ చేసినా చట్టపరమై...
09/10/2026

చిన్నారులకు సంబంధించిన లైంగిక అసభ్యకర వీడియోలను (చైల్డ్ పోర్నోగ్రఫీ) వీక్షించినా, డౌన్‌లోడ్ చేసినా, షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవు.

తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిపై ఐటీ చట్టం ప్రకారం కేసులు నమోదు.
Telangana State Police

RTO అధికారి పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ లు రిన్యువల్ చేస్తానంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న వేములవాడకు చెందిన నీరటి తిరుమల్...
09/10/2026

RTO అధికారి పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ లు రిన్యువల్ చేస్తానంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న వేములవాడకు చెందిన నీరటి తిరుమల్ అరెస్ట్ , నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, 2 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించిన వేములవాడ రూరల్ పోలీసులు.

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి పిర్యాదు చేయండి.
Telangana State Police

తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చ...
09/10/2026

తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన తంగళ్లపల్లి పోలీసులు.
Telangana State Police

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్కాణిపేట గ్రామంలో ఆలయాల్లో చోరీకి పాల్పడిన నిందితులు రాగులు అనిల్, పల్లె వేణు లను...
09/10/2026

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్కాణిపేట గ్రామంలో ఆలయాల్లో చోరీకి పాల్పడిన నిందితులు రాగులు అనిల్, పల్లె వేణు లను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఇల్లంతకుంట పోలీసులు.

నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలకం. ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
Telangana State Police

సైబర్ నేరాల నివారణలో ముందస్తు అప్రమత్తతే కీలకం.వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రహారంలోని  JNTUHలో విద్యార్థులకు సైబ...
07/10/2026

సైబర్ నేరాల నివారణలో ముందస్తు అప్రమత్తతే కీలకం.వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రహారంలోని JNTUHలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, వ్యక్తిగత సమాచార భద్రతపై సూచనలు చేయడం జరిగింది.

సైబర్ మోసానికి గురైన వెంటనే భయపడకుండా గోల్డెన్ అవర్‌లో 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించాం. సైబర్ భద్రతపై అవగాహన పెంచుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా అప్రమత్తం చేయాలి.
Telangana State Police

కోర్టు ట్రయల్‌లో ఉన్న కేసుల్లో శిక్షల శాతం పెంచే దిశగా పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్ట్ మానిటరింగ్ బృందంతో సమీక్ష సమావేశం న...
06/10/2026

కోర్టు ట్రయల్‌లో ఉన్న కేసుల్లో శిక్షల శాతం పెంచే దిశగా పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్ట్ మానిటరింగ్ బృందంతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈసందర్భంగా కేసుల పురోగతి, సాక్షుల హాజరు, ఆధారాల సమర్పణ, పెండింగ్ అంశాలను సమీక్షించి,ప్రాసిక్యూషన్‌తో సమన్వయం చేసుకుంటూ, నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేయాలని సూచించడం జరిగింది.
Telangana State Police

జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జ...
03/10/2026

జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

Address

రాజన్న సిరిసిల్ల
Sircilla
505301

Alerts

Be the first to know and let us send you an email when Rajanna Sircilla District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category