Nadukuditi Eswara Rao - Ner

Call Directions Contact the organization

Nadukuditi Eswara Rao - Ner Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nadukuditi Eswara Rao - Ner, Etcherla, Srikakulam.

"సేవా సంకల్పానికి సైకత సాక్ష్యం..!"సేవా సంకల్ప అభియాన్‌ శ్రీకాకుళం జిల్లా కో-కన్వీనర్‌ ఎన్. తేజ బాబు ఆధ్వర్యంలో రణస్థలం ...
05/10/2026

"సేవా సంకల్పానికి సైకత సాక్ష్యం..!"

సేవా సంకల్ప అభియాన్‌ శ్రీకాకుళం జిల్లా కో-కన్వీనర్‌ ఎన్. తేజ బాబు ఆధ్వర్యంలో రణస్థలం మండలం జీరుపాలెం బీచ్‌లో నిర్వహించిన ప్రత్యేక సైకత రంగోలి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ సంకల్పాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ సైకత రంగోలి దేశభక్తి, సేవా సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ లంక శ్యామ్ గారు, శ్రీకాకుళం జిల్లా బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం జీరుపాలెం బీచ్‌లో ప్రధానమంత్రి శ్రీ...
04/10/2026

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం జీరుపాలెం బీచ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక సైకత రంగోలి చిత్రాన్ని రూపొందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొని యువత, పార్టీ శ్రేణులు మరియు నిర్వాహకులను అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. దేశం పట్ల ప్రేమ, సేవా భావం, స్వచ్ఛతపై అవగాహనను చాటిచెప్పే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ శ్రీకాకుళం జిల్లా కో-కన్వీనర్ శ్రీ ఎన్. తేజ బాబుకి, నిర్వాహకులకు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ సిరిపురం తేజేశ్వరరావు గారు, టీడీపీ ఇంచార్జ్ శ్రీ లంక శ్యామ్ గారు, శ్రీకాకుళం జిల్లా బీజేపీ కోర్ కమిటీ సభ్యులు శ్రీ ఇజ్జడ శ్రీను గారు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

🇮🇳 సేవే సంకల్పం.. దేశమే ప్రథమం..

రణస్థలం మండల అభివృద్ధిలో భాగంగా ఈరోజు పలు గ్రామాల్లో మొత్తం రూ.11.19 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడం, మరికొన...
04/10/2026

రణస్థలం మండల అభివృద్ధిలో భాగంగా ఈరోజు పలు గ్రామాల్లో మొత్తం రూ.11.19 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడం, మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.

కొండములగాం పంచాయతీ..
🔹 రూ.25 లక్షలతో ప్రధాన గ్రామంలోకి వెళ్లే సీసీ రోడ్డు ప్రారంభం
🔹 రూ.33 లక్షలతో నిర్మించిన ఇండోర్ స్టేడియంకు వెళ్లే సీసీ రోడ్డు ప్రారంభం
🔹 రూ.1.30 కోట్లతో నిర్మించిన మోడల్ స్కూల్–సీతంవలస బీటీ రోడ్డు ప్రారంభం

JR పురం పంచాయతీ

🔹 రూ.10 లక్షలతో గొల్లపేట సీసీ రోడ్డు ప్రారంభం
🔹 రూ.10 లక్షలతో ట్వింకిల్ స్కూల్‌కు వెళ్లే సీసీ రోడ్డు ప్రారంభం
🔹 రూ.33 లక్షలతో MRO కార్యాలయానికి వెళ్లే సీసీ రోడ్డు ప్రారంభం
🔹 రూ.16 లక్షలతో పిన్నింటిపేటకు వెళ్లే సీసీ రోడ్డు ప్రారంభం
🔹 రూ.10 లక్షలతో మసీదు ప్రక్కన సీసీ రోడ్డు ప్రారంభం
🔹 రూ.5.40 కోట్లతో భద్ర మహంకాళి గుడి వద్ద నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం
🔹 రూ.2.77 కోట్లతో NH-16 నుండి చిల్లపేట రాజాం వరకు బీటీ రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన

పిసిని పంచాయతీ
🔹 రూ.27 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం

ప్రజలకు మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యాలు, ఆరోగ్య వసతులు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, టీడీపీ ఇంచార్జ్ శ్రీ లంక శ్యామలరావు గారు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా... ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తాం.

ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బెజ్జిపురం గ్రామానికి చెందిన శ్రీమతి దాసరి తవిటమ్మ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)...
03/10/2026

ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బెజ్జిపురం గ్రామానికి చెందిన శ్రీమతి దాసరి తవిటమ్మ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.30,000/- ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈరోజు నా క్యాంపు కార్యాలయంలో అందజేశాను.

ఆపదలో ఉన్న పేద, సామాన్య కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఇజ్జడ శ్రీనివాసరావు, టీడీపీ ప్రధాన ఉపాధ్యక్షులు వడ్డిపల్లి శ్రీను, టీడీపీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి మధుబాబు, మండల పార్టీ అధ్యక్షులు కుమారపు రవికుమార్, నక్క మురళీధర్, బాలబామ్మ వెంకటేశ్వరరావు, ఆకుల రవికుమార్, మనం సత్యారావు మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే మా ప్రాధాన్యత. 🙏

#ఎచ్చెర్ల #లావేరు

ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధ...
03/10/2026

ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి చెక్కుల రూపంలో అందజేశాను.

లబ్ధిదారుల వివరాలు:

🔹 ముద్దాడ పంచాయతీ – ఏదురేషం గౌరీ : రూ.20,000/-
🔹 ఇబ్రహీంబాద్ పంచాయతీ – సీపాన దేశంబార్ రావు : రూ.30,786/-
🔹 ఇబ్రహీంబాద్ పంచాయతీ – దానేటి ఆదినారాయణ : రూ.1,09,478/-
🔹 ఎచ్చెర్ల పంచాయతీ – జరుగుళ్ల తనుశ్రీ : రూ.30,501/-
🔹 కేశవరావుపేట పంచాయతీ – పొన్నాడ మాధురి : రూ.41,870/-

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం, అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించడం మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రజల సంక్షేమం కోసం అందుబాటులో ఉంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తాను.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

"ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి..!"'గ్రామీణ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల జాయింట్ యాక్షన్ కమిటీ' ఎచ్చెర్ల నియోజ...
03/10/2026

"ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి..!"

'గ్రామీణ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల జాయింట్ యాక్షన్ కమిటీ' ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రతినిధులు ఈ రోజు క్యాంపు కార్యాలయంలో నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వీబీజీ రామ్‌జీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం పెంచడం, ఉద్యోగ భద్రత కల్పించడం, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై వినతిపత్రం అందించారు.

ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చాను.

ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎచ్చెర్ల మండలంలో రూ.8.83 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు రోడ్ల మరమ్మత్తు పనుల...
03/10/2026

ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎచ్చెర్ల మండలంలో రూ.8.83 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు రోడ్ల మరమ్మత్తు పనులకు ఈ రోజు శంకుస్థాపనలు చేయడం జరిగింది.

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన రహదారులను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నాము.

🔹 రూ.1.83 కోట్లతో
భగీరథపురం – మూసవానిపేట వయా కొయ్యాం 11.5 కి.మీ ఆర్&బి రోడ్డు మరమ్మత్తు పనులు.

🔹 రూ.1.77 కోట్లతో
కొయ్యాం – బడివానిపేట వయా నిమ్మవానిపేట రోడ్డు మరమ్మత్తు పనులు.

🔹 రూ.2.13 కోట్లతో
పొన్నాడ ఆర్&బి రోడ్డు – కమ్మవారిపేట వయా కొంగరాం రోడ్డు మరమ్మత్తు పనులు.

🔹 రూ.3.10 కోట్లతో
తోటపాలెం – మత్స్యలేశం వయా ముద్దాడ, రామజోగిపేట, ఓ.ఏ. అగ్రహారం వరకు రోడ్డు మరమ్మత్తు పనులు.

ఈ రహదారుల అభివృద్ధితో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు మరియు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఎచ్చెర్ల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సేవా సంకల్ప అభియాన్”...
02/10/2026

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సేవా సంకల్ప అభియాన్” లో భాగంగా, శ్రీకాకుళం జిల్లా కో-కన్వీనర్ శ్రీ నడుకుదిటి తేజబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.

నా పిలుపుకు స్పందించి ఎచ్చెర్ల నియోజకవర్గం నలుమూలల నుంచి సుమారు 916 మంది స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయం. రక్తదానం ద్వారా తోటి వారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. ❤️

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 10 బ్లడ్ బ్యాంక్ సంస్థలు పాల్గొని రక్త సేకరణలో సహకరించాయి. రక్తదాతలను సర్టిఫికెట్లు, మెమెంటోలతో సత్కరించాం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

అలాగే ఎచ్చెర్ల టీడీపీ ఇంచార్జ్ శ్రీ లంక శ్యామలరావు గారు, జనసేన ఇంచార్జ్ డాక్టర్ విశ్వక్షేన్ గారు, నాలుగు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, అధికారులు, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు మరియు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏

రక్తదానం ప్రాణదానం.. మనం ఇచ్చే రక్తం మరొకరి జీవితానికి భరోసా🩸❤️

దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, నిరాడంబరతకు, నిజాయితీకి, దేశభక్తికి ప్రతీక అయిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి...
02/10/2026

దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, నిరాడంబరతకు, నిజాయితీకి, దేశభక్తికి ప్రతీక అయిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 🙏

“జై జవాన్ – జై కిసాన్” అనే నినాదంతో దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశ ప్రగతిలో రైతుల పాత్రను చాటి చెప్పిన శాస్త్రి గారి సేవలు చిరస్మరణీయం.

దేశ సమగ్ర అభివృద్ధి కోసం ఆయన చూపిన దేశభక్తి, క్రమశిక్షణ, నిస్వార్థ సేవా స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకుందాం.

లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని పవిత్ర స్మృతికి శతకోటి వందనాలు. 🇮🇳🙏

#జైజవాన్_జైకిసాన్

జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని పవిత్ర స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 🙏సత్యం, అహింస, శాంతి, సమ...
02/10/2026

జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని పవిత్ర స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 🙏
సత్యం, అహింస, శాంతి, సమానత్వం, నిస్వార్థ సేవ వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను ఆదర్శంగా తీసుకొని సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను మరింతగా పెంపొందించేందుకు మనమంతా కృషి చేద్దాం.
మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి వందనాలు. 🙏🇮🇳

Address

Etcherla
Srikakulam
532407

Telephone

+919701333666

Website

Alerts

Be the first to know and let us send you an email when Nadukuditi Eswara Rao - Ner posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nadukuditi Eswara Rao - Ner:

Shortcuts

Share