10/10/2026
రాష్ట్రంలో ప్రకృతి సేద్యం విస్తీర్ణం పెంపు, పీఎండీఎస్‌పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌కు మంత్రి శ్రీ కే. అచ్చెన్నాయుడు, రైతులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు.
నేచురల్ ఫార్మింగ్ విస్తరణకు అందరూ యుద్ధ ప్రాతిపదికన పనిచేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అని సీఎం అన్నారు.
2016లో కేవలం 40 వేల మంది రైతులతో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం నేడు 17.73 లక్షల మంది రైతులకు చేరిందనీ, రసాయన ఎరువుల వినియోగంతో పోలిస్తే, ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయం 47 శాతం మేర పెరుగుతుందని సీఎం అన్నారు.