27/08/2026
కక్ష్య సాధింపు అని గగ్గోలు పెట్టె YCP పార్టీ మేధావుల్లారా...
దమ్ముంటే నా ప్రశ్నకి సమాధానం చెప్పండి..
నేను తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తను. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు, మా నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జేసీ ప్రభాకర్, జేసీ అష్మిత్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పనిచేసే కార్యకర్తను. సమాజం పట్ల అవగాహన కలిగిన ఒక జర్నలిస్ట్ గా పని చేసిన వ్యక్తిని. నాకు ఎలాంటి నేర చరిత్ర, క్రిమినల్ చరిత్ర లేని వ్యక్తిని. అలాంటి నా మీద గత ప్రభుత్వం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (Preventive Detention Act) అనగా ముందస్తు నిర్బంధ చట్టం కింద 27.08.2023న అరెస్ట్ చేసి కడప కేంద్ర కారాగారంలో నిర్బంధం చేశారు.
దాదాపు సంవత్సరం పాటు జైలులోనే నిర్బంధం చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు GO Rt No 2116 తేదీ 30.10.2023న ఇచ్చారు.
పార్టీ కోసం పని చేసే నా లాంటి సామాన్య కార్యకర్తపై దొంగతనాలు, దోపిడీలు, రౌడీయిజం, గ్యాంగ్‌స్టరిజం, మరియు పబ్లిక్ ఆర్డర్‌కు తీవ్రంగా భంగం కలిగించే నేరస్థులపై పెట్టె P.D. యాక్ట్ పెట్టి జైలుల్లో నిర్బంధం చేయడం మీకు సిగ్గు అనిపించలేదా. పైగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తాడిపత్రిలో ప్రజాస్వామ్యం లేదు.. ఆ రాజ్యం, ఈ రాజ్యం అంటూ వాడుతున్న YSRCP మేథావులారా.. నా విషయంలో మీ పార్టీ లేదా మీ పార్టీ నాయకులు చేసిన చర్య సరైనదేనని నిరూపించే దమ్ముందా అని నేను సవాల్ చేస్తున్న.. మీరు చేసిన దురాగతాలకు మా నాయకులతో కలిసి పోరాడుతున్నాననే కక్ష్యతోనే నాపై PD యాక్ట్ పెట్టారు అని నేనంటున్నా కాదు అని మీ మనస్సాక్షి గా చెప్పే దైర్యం ఉందా.. YSRCP తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, YSRCP అనంతపురం జిల్లా అధ్యక్షులు, లేదా ఆ పార్టీకి వత్తాసు పలికిన మేధావులు గా భావించే వారు నాకు జరిగిన ఈ అన్యాయంకు ఏమని సమాధానం ఇస్తారో చెప్పండి..
పరిమి సోమశేఖర్ నాయుడు
తాడిపత్రి.