ITDP Tanuku Niyojakavargam

Directions

ITDP Tanuku Niyojakavargam రాష్ట్ర అభివృద్ధి కోసం....

కూటమి శ్రేణులకు ముఖ్య గమనికతణుకు శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారి రేపటి అత్తిలి మండల పర్యటన వివరాలు (09-10-2026...
08/10/2026

కూటమి శ్రేణులకు ముఖ్య గమనిక

తణుకు శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారి రేపటి అత్తిలి మండల పర్యటన వివరాలు (09-10-2026, శుక్రవారం):

🕘 ఉదయం 09:00 గం॥
👉 వరిగేడు: ₹26.6 లక్షల వ్యయంతో ‘పల్లె పండుగ 3.0’ శంకుస్థాపన మరియు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.

🕤 ఉదయం 09:30 గం॥
👉 గుమ్మంపాడు: ₹42.0 లక్షల వ్యయంతో ‘పల్లె పండుగ 3.0’ శంకుస్థాపన మరియు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.

🕙 ఉదయం 10:00 గం॥
👉 బల్లిపాడు: ₹17.55 లక్షల వ్యయంతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.

🕥 ఉదయం 10:30 గం॥
👉 ఉరదాళ్ళపాలెం: ₹31.0 లక్షల వ్యయంతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.

🕚 ఉదయం 11:00 గం॥
👉 అత్తిలి: ₹107.11 లక్షల వ్యయంతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.

మొత్తం నిధులు: ₹2 కోట్ల 24.26 లక్షలు (రూ. 2,24,26,000/-)

📍 ఇట్లు,
ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం,
తణుకు.

https://www.facebook.com/share/1FoRkcyA6P/
06/10/2026

https://www.facebook.com/share/1FoRkcyA6P/

శ్రద్ధాంజలి

మా చిన్నాన్న
వేల్పూరు గ్రామ మాజీ సొసైటీ అధ్యక్షులు మరియు సర్పంచ్ శ్రీ పెనుమర్తి సోమసూర్యచంద్రరావు (దత్తుడు) గారికి ఘన నివాళులు

ఆరిమిల్లి, పెనుమర్తి కుటుంబాలకు పెద్దదిక్కుగా, ఆత్మీయంగా అందరినీ ఆదరిస్తూ, కుటుంబ సభ్యులందరికీ మార్గదర్శిగా నిలిచిన మా చిన్నాన్నగారు పరమపదించడం మా కుటుంబానికి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు.

ఆయనతో మాకు ఉన్న అనుబంధం, ఆయన అందించిన ఆప్యాయత, చూపిన మార్గదర్శకత్వం ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతాయి.

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ...

శోకతప్త హృదయంతో,
ఆరిమిల్లి రాధాకృష్ణ

సర్వే ఏదైనా…తణుకు గడ్డపై ఆరిమిల్లిదే హవా!చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు నియ...
04/10/2026

సర్వే ఏదైనా…తణుకు గడ్డపై ఆరిమిల్లిదే హవా!

చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు నియోజకవర్గం మూడో స్థానంలో నిలవడం ప్రజల ఆదరణకు నిదర్శనం.🙏✌️


04/10/2026

"చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి మూడో ర్యాంక్"

తణుకు నియోజకవర్గానికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ప్రముఖ రాజకీయ విశ్లేషణ సంస్థ “చాణక్య స్ట్రాటజీస్ - Political Survey & Operations” నిర్వహించిన ఎమ్మెల్యేల పనితీరు ర్యాంకింగ్స్‌లో తణుకు నియోజకవర్గం మూడో స్థానాన్ని సాధించింది.
తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజా సంక్షేమం,మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నిరంతరం దృష్టి సారిస్తూ పనిచేస్తున్నారని ఈ సందర్భంగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం వంటి అంశాల్లో ఎమ్మెల్యే చూపుతున్న చొరవకు ఈ ర్యాంకింగ్ ఒక గుర్తింపుగా నిలుస్తుందని తెలిపారు.

“ప్రజా సేవలో నిరంతరం ముందుండటం...అభివృద్ధి పనుల్లో వేగం పెంచడం తణుకు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యం” అని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు.

చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో తణుకు నియోజకవర్గానికి 3వ ర్యాంక్ రావడం పట్ల నియోజకవర్గ ప్రజలు,టిడిపి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సత్తిబాబు చిత్తజల్లు-తణుకు✍️


"మృతి చెందిన కూటమి కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరామర్శ"తణుకు పట్టణంతో పాటు అత్తిలి మండలంలోని గుమ...
04/10/2026

"మృతి చెందిన కూటమి కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరామర్శ"
తణుకు పట్టణంతో పాటు అత్తిలి మండలంలోని గుమ్మంపాడు, బల్లిపాడు, తిరుపతిపురం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కూటమి కార్యకర్తల కుటుంబాలను తణుకు ఎమ్మెల్యే శ్రీ Arimilli RadhaKrishna గారు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి,తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. కార్యకర్తల సేవలను స్మరించుకుంటూ,కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

"తణుకులో ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ ఓనర్స్ అసోసియేషన్ నూతన మీటింగ్ హాల్ ప్రారంభం"ఆరోగ్య రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర...
04/10/2026

"తణుకులో ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ ఓనర్స్ అసోసియేషన్ నూతన మీటింగ్ హాల్ ప్రారంభం"
ఆరోగ్య రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుంది: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.

తణుకు ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ ఓనర్స్ అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్‌ను తణుకు ఎమ్మెల్యే శ్రీ Arimilli RadhaKrishna గారు ప్రారంభించారు. అనంతరం అదే హాల్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన హామీ మేరకు అసోసియేషన్‌కు మీటింగ్ హాల్‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ హాల్ అసోసియేషన్ సమావేశాలు, సభ్యుల సమస్యలపై చర్చలు, వైద్య పరీక్షల రంగంలో వస్తున్న నూతన సాంకేతికతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. తద్వారా సభ్యుల మధ్య సమన్వయం పెరిగి, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య పరీక్షల సేవలు అందించేందుకు దోహదపడుతుందని ఆకాంక్షించారు.

ఆరోగ్య రంగ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Address

Tanuku
Tanuku

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Tanuku Niyojakavargam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share