Tirupati Updates

Directions Contact the organization

Tirupati Updates Believe in the power of Lord Venkateswara Swamy and he will guide you through your troubles. 🙏🏻 To Contribute Mail us To [email protected]

Welcome to Tirupati Updates

You will get complete information about Tirupati city & things happening in and around Tirupati and Tirumala.

తిరుమల ఘాట్ రోడ్లలో రాపిడో, ఓలా, ఉబర్ బైక్ సేవలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల భద్రత దృష్ట్యా తిరుపతి–తిరుమల ఘా...
05/10/2026

తిరుమల ఘాట్ రోడ్లలో రాపిడో, ఓలా, ఉబర్ బైక్ సేవలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

భక్తుల భద్రత దృష్ట్యా తిరుపతి–తిరుమల ఘాట్ రోడ్లలో రాపిడో, ఓలా, ఉబర్ లేదా ఇతర యాప్ ఆధారిత బైక్ సేవలను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది.

ఇటీవల మొదటి ఘాట్ రోడ్డులోని 26వ మలుపు వద్ద జరిగిన రాపిడో బైక్ ప్రమాదంలో రైడర్ మృ/తి చెందగా, ప్రయాణికుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

తిరుపతి–తిరుమల ఘాట్ రోడ్లలో ప్రైవేట్‌గా వినియోగించే ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది, రాపిడో, ఓలా, ఉబర్ లేదా ఇతర యాప్ ఆధారిత సేవల ద్వారా బుక్ చేసిన ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు.

భక్తుల భద్రత, ట్రాఫిక్ సజావుగా నిర్వహించడం మరియు సౌకర్యం కోసం ఈ నిబంధనలను పాటించాలని టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం సూచించింది.

04/10/2026

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

మావటి చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలు.. భయంతో పరుగులు తీసిన భక్తులు

తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ఏనుగు బీభత్సం సృష్టించింది. ఉంజల్ సేవ అనంతరం ఏనుగులను ఉద్యానవనానికి తరలిస్తుండగా ఓ ఏనుగు ఒక్కసారిగా మావటి చంద్రశేఖర్‌ను కింద పడేసి తొక్కింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. 108 సిబ్బంది గాయపడిన చంద్రశేఖర్‌ను ఆస్పత్రికి తరలించారు.

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్డులోని 26వ మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ...
26/09/2026

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్డులోని 26వ మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

మృతుడిని తిరుపతికి చెందిన వెంకటేష్‌గా, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హైదరాబాద్‌కు చెందిన సునీల్‌గా గుర్తించినట్లు సమాచారం.

గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ ద్వారా తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

⚠️ డ్రైవింగ్ సమయంలో వేగం, మలుపుల వద్ద అప్రమత్తత చాలా ముఖ్యం.

22/09/2026

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం...

2754 మెట్టు సమీపంలో ఓ చెట్టుపై కూర్చొని ఉన్న చిరుత...

చిరుతను‌ చూసి భయాందోళనకు గురైన‌ భక్తులు...

భక్తుల‌ సంరక్షణ దృష్ట్యా భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్న భద్రతా సిబ్బంది...

గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు 🙏🏻
20/09/2026

గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు 🙏🏻

20/09/2026

శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి వారు.

శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి వారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆ...
20/09/2026

శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి వారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం సాయంత్రం స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చి అనుగ్రహించారు.

20/09/2026

హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీమలయప్ప స్వామి.

హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీమలయప్ప స్వామి. రామభక్త హనుమంతునిపై భక్తులను కటాక్షించిన శ్రీమలయప్ప స్వామి వారు.
20/09/2026

హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీమలయప్ప స్వామి.

రామభక్త హనుమంతునిపై భక్తులను కటాక్షించిన శ్రీమలయప్ప స్వామి వారు.

A divine sight of Sri Malayappa Swamy on the Garuda Vahanam during the grand Srivari Brahmotsavams at Tirumala.Thousands...
19/09/2026

A divine sight of Sri Malayappa Swamy on the Garuda Vahanam during the grand Srivari Brahmotsavams at Tirumala.

Thousands of devotees gathered to seek the blessings of Lord Venkateswara on this auspicious occasion.

Address

Tirumala

Website

Alerts

Be the first to know and let us send you an email when Tirupati Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tirupati Updates:

Shortcuts

Share