Tirupati Police

Call Directions Website Contact the organization

Tirupati Police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tirupati Police, Government Organization, Police Parade Ground, Back side of ESI Hospital, AIR Bypass Road, Tirupati.
(1974)

📱🚶 రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండండి!మీ స్క్రీన్ వేచి ఉండగలదు… రోడ్డుపై ప్రాణాలు వేచి ఉండవు!రోడ్డు దాటేటప్పుడు మొబైల...
06/09/2026

📱🚶 రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండండి!

మీ స్క్రీన్ వేచి ఉండగలదు… రోడ్డుపై ప్రాణాలు వేచి ఉండవు!

రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ చూడకుండా, ఇరువైపులా చూసి, వాహనాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రోడ్డు దాటండి.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్ వినియోగించవద్దు.

ఒక్క క్షణం నిర్లక్ష్యం… జీవితాంతం పశ్చాత్తాపం కావచ్చు.
అప్రమత్తంగా ఉండండి – సురక్షితంగా ఉండండి. 🚔

తిరుపతి జిల్లా పోలీస్

🚗 సురక్షిత వేగమే అత్యుత్తమ వేగంవేగం కంటే భద్రతే ముఖ్యం.హైవేలపై సూచించిన వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించండి.అతివేగాన్ని...
06/09/2026

🚗 సురక్షిత వేగమే అత్యుత్తమ వేగం

వేగం కంటే భద్రతే ముఖ్యం.
హైవేలపై సూచించిన వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించండి.

అతివేగాన్ని నివారించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి.

మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది… సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోండి. 🚔

Digital News Paper Clippings
06/09/2026

Digital News Paper Clippings

👧👦 బాలల భద్రత మనందరి బాధ్యతబాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.వారు భద్రమైన వాతావరణంలో పెరిగేలా మనమంతా కలిసి కృషి చేద్దాం.వార...
06/09/2026

👧👦 బాలల భద్రత మనందరి బాధ్యత

బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.
వారు భద్రమైన వాతావరణంలో పెరిగేలా మనమంతా కలిసి కృషి చేద్దాం.

వారి భద్రతే మన బాధ్యత… వారి భవిష్యత్తే మన లక్ష్యం. 💙

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ🔐 OTP, CVV, PIN వంటి రహస్య వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దు.🚫 బ్యాంక్ సిబ్బంది పేరుతో అడిగినా ఈ ...
06/09/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
🔐 OTP, CVV, PIN వంటి రహస్య వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దు.
🚫 బ్యాంక్ సిబ్బంది పేరుతో అడిగినా ఈ వివరాలు చెప్పకండి.

📱 అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు స్పందించకుండా అప్రమత్తంగా ఉండండి.

🛡️ మీ బ్యాంకింగ్ వివరాలను గోప్యంగా ఉంచి సైబర్ మోసాల నుంచి రక్షించుకోండి.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖరాత్రి వేళల్లో వాహన చోదకులకు కలిగే అలసట మరియు నిద్రమత్తు కారణంగా సంభవించే రోడ్డు ప్రమాదాలను నివ...
06/09/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
రాత్రి వేళల్లో వాహన చోదకులకు కలిగే అలసట మరియు నిద్రమత్తు కారణంగా సంభవించే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు, “ఆగి ముఖం కడుక్కోండి” కార్యక్రమం మరియు మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా అనే తనిఖీలు నిర్వహించడమైనది.
ఈ సందర్భంగా వాహనదారులకు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, నిద్రమత్తుగా లేదా అలసటగా అనిపించినప్పుడు వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో నిలిపి తగినంత విశ్రాంతి తీసుకోవాలని, వాహనం నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని మరియు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించి అవగాహన కల్పించడమైనది.
ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం రాత్రి వేళల్లో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడం, వాహనదారుల భద్రతను పెంపొందించడం మరియు రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం..

🚕 ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమంతిరుమల ట్రాఫిక్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో, ఈ రోజు రాత్రి RBGH వద్ద ట్యాక్సీ డ్రైవర్లకు అవగ...
05/09/2026

🚕 ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

తిరుమల ట్రాఫిక్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో, ఈ రోజు రాత్రి RBGH వద్ద ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ప్రయాణికుల భద్రత, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ తదితర అంశాలపై ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

సురక్షిత ప్రయాణం – బాధ్యతాయుత డ్రైవింగ్ మనందరి బాధ్యత. 🚔

🔹 తిరుపతి రూరల్ పరిధిలో బ్యాంకులు, ఏటీఎంల తనిఖీలుతిరుపతి రూరల్ CI గారి ఆధ్వర్యంలో, తిరుపతి రూరల్ పోలీస్ పరిధిలోని చెర్లో...
05/09/2026

🔹 తిరుపతి రూరల్ పరిధిలో బ్యాంకులు, ఏటీఎంల తనిఖీలు

తిరుపతి రూరల్ CI గారి ఆధ్వర్యంలో, తిరుపతి రూరల్ పోలీస్ పరిధిలోని చెర్లోపల్లి మరియు పరిసర ప్రాంతాల్లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు తదితర అంశాలను పరిశీలించారు.

ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరంతర నిఘా మరియు భద్రతా చర్యలు చేపడుతున్నారు.

ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యం.

బ్యాంకులు, ఏటీఎంల వద్ద పోలీసుల తనిఖీలుప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వీకేఆర్వై కాలనీ పరిధిలోని బ్యాంకులు మరియు ఏటీఎంలను...
05/09/2026

బ్యాంకులు, ఏటీఎంల వద్ద పోలీసుల తనిఖీలు

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వీకేఆర్వై కాలనీ పరిధిలోని బ్యాంకులు మరియు ఏటీఎంలను శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను పరిశీలించారు.

బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరంతర తనిఖీలు, భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

AndhraPradesh
05/09/2026

AndhraPradesh

Address

Police Parade Ground, Back Side Of ESI Hospital, AIR Bypass Road
Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when Tirupati Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tirupati Police:

Shortcuts

Share