TDP Tiruvuru Town

Directions

TDP Tiruvuru Town Committed to empowering the youth, farmers, and every citizen. We stand for transparent governance, development-driven politics, and Telugu pride.

Join us in building a brighter, stronger Tiruvuru.

26/05/2026

తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు చంద్రబాబు గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.

మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.

మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!


#నాతెలుగుదేశంనాబాధ్యత

తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్...
26/05/2026

తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు చంద్రబాబు గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.

మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.

మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!

#నాతెలుగుదేశంనాబాధ్యత

06/05/2026

మా విజన్ కేవలం డేటా సెంటర్ల నిర్మాణంతో మాత్రమే పరిమితం కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ ఎకోసిస్టమ్‌ను నిర్మించడం మా ప్రధాన లక్ష్యం.




తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రాష్ట్ర ఐటీ శాఖామాత్యులు, మా ప్రియతమ నేత శ్...
29/04/2026

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రాష్ట్ర ఐటీ శాఖామాత్యులు, మా ప్రియతమ నేత శ్రీ Nara Lokesh గారికి శుభాభినందనలు 💐💐

25/04/2026

ఎన్టీఆర్ జిల్లా..

తిరువూరు టౌన్..

పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్

ఎన్టీఆర్ జిల్లా..తిరువూరు టౌన్..- అన్నా క్యాంటీన్ల‌కు విరాళాల‌తో చేయూత‌నివ్వండి..- ముఖ్య‌మంత్రి దంప‌తుల స్ఫూర్తితో ముందు...
22/04/2026

ఎన్టీఆర్ జిల్లా..

తిరువూరు టౌన్..

- అన్నా క్యాంటీన్ల‌కు విరాళాల‌తో చేయూత‌నివ్వండి..

- ముఖ్య‌మంత్రి దంప‌తుల స్ఫూర్తితో ముందుకురండి

* జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశా

* అన్నార్తుల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టి ఆక‌లి తీర్చి మార్గ‌ద‌ర్శుల‌కు అన్న‌దాత‌లుగా మారే అవ‌కాశ‌ముంద‌ని.. ప్ర‌తిఒక్క‌రూ వారి ఇళ్ల‌లో జ‌రిగే శుభ‌కార్యాలు సంద‌ర్భంగా అన్నా క్యాంటీన్‌కు విరాళం అందించి మంచి మ‌న‌సు చాటుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు..

* జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తిరువూరు ప‌ట్ట‌ణంలోని అన్నా క్యాంటీన్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు..

* పేద‌ల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. ఆహార ప‌ట్టిక‌ టోకెన్ కౌంట‌ర్‌ ఆహార ప‌దార్థాల‌ను వ‌డ్డిస్తున్న స్థ‌లం డైనింగ్ ఏరియాతో పాటు ప‌రిశుభ్ర‌మైన స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేతులు శుభ్రం చేసుకునేందుకు చేసిన ఏర్పాట్లు మ‌రుగుదొడ్లు త‌దిత‌రాల‌ను ప‌రిశీలించారు..

* ఆహారాన్ని రుచిచూసి సంతృప్తి వ్య‌క్తం చేశారు..

* అక్క‌డికి వ‌చ్చిన వారితో మాట్లాడి అన్నా క్యాంటీన్‌పై అభిప్రాయాలను తెలుసుకున్నారు..

21/04/2026

ఆనాడు వివేకానంద రెడ్డి హత్య కు ముందు ,హత్య తర్వాత వైసీపీ నాయకులు ఎలాంటి డ్రామాలు ఆడారో, దస్తగిరి హత్య విషయంలో ఈనాడు అలాంటి డ్రామాలే ఆడుతున్నారు.


21/04/2026

నేను"అన్న క్యాంటీన్ "కి రెగ్యులర్ గా వచ్చి భోజనం చేస్తుంటాను. ఈరోజు చాలా స్పెషల్. సీఎం చంద్రబాబు గారితో కలిసి టిఫిన్ చేసే అదృష్టం కలిగింది.



కడపలో వైకాపా 'జాతర'!హతుడు వైసీపీ కార్యకర్త.. చంపింది వైసీపీ రౌడీలు.. చంపించింది వైసీపీ నాయకుడు!"గంగమ్మ జాతరలో పొట్టేళ్లన...
21/04/2026

కడపలో వైకాపా 'జాతర'!
హతుడు వైసీపీ కార్యకర్త.. చంపింది వైసీపీ రౌడీలు.. చంపించింది వైసీపీ నాయకుడు!

"గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు.. మావాళ్లు రఫ్ఫా రఫ్ఫా నరుకుతారని చెప్పారు, మంచిదే కదా" అని ఇటీవలే జగన్ చెప్పిన ఆ మాటలు, కడప వైకాపాకు తలకెక్కినట్లుంది. నిజంగానే రక్తపుటేరులై పారుతున్నాయి! గొర్రెలను నరకాల్సిన వారు, కడప శివారు ఆలంఖాన్‌పల్లె మారెమ్మ జాతరలో మనుషులను నరకడానికి స్కెచ్ వేశారు. హతుడు వైసీపీ కార్యకర్త.. చంపింది వైసీపీ రౌడీలు.. చంపించింది వైసీపీ నాయకుడు. ఇదంతా ఒక 'వైకాపా జాతర'!

ఏప్రిల్ 4న ఆలంఖాన్‌పల్లెలో మారెమ్మ జాతర సందర్భంగా జరిగిన ఒక చిన్న గొడవతో ఈ వివాదం మొదలైంది. డిజే ఏర్పాటు విషయంలో దస్తగిరి కుమారుడు వెంకట దస్తగిరిని, వెంకటేష్ అనే వ్యక్తి వాగ్వాదానికి దిగారు. మరుసటి రోజు (ఏప్రిల్ 5) రాత్రి, వెంకట దస్తగిరిపై వెంకటేష్ మరియు అతని అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం దస్తగిరి మరియు అతని సోదరుడు చిన్న దస్తగిరి కడప రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

అక్కడ.. ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రి ప్రాంగణంను 'కసాయి ఖానా'గా మార్చారు. రిమ్స్‌లో కాపు కాచిన నిందితులు, పెద్ద దస్తగిరిపై పదికి పైగా కత్తిపోట్లు పొడిచారు! రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న దస్తగిరిని చూస్తూ ఆ నిందితులు పక్కనే ఉన్నారు.

హత్య జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న వైకాపా కీలక నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, శవం ముందు నిలబడి (అచ్చం వివేకా శవం వద్ద తమ ఎంపీ లెక్కన) విలపిస్తున్నట్టు నటిస్తూ, దస్తగిరి శరీరంలోని గాయాలను తన చేత్తో చూపిస్తూ.. ఎంత క్రూరంగా చంపారో వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు! వివేకా గొడ్డలి కేసులో బాబాయి శవం దగ్గర జగన్ చేసిన అభినయాన్ని, నిత్యానందరెడ్డి నటనతో ప్రజలు పోల్చుకున్నారు. ఈ మొత్తం హత్యకు తనే స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహించాడని దర్యాప్తులో తేలింది.

కేసును పక్కదారి పట్టించడం, భద్రతా వైఫల్యంపై విమర్శలు రావడంతో.. కడప డీఎస్పీ, చిన్నచౌకు సీఐ, మరియు ఎస్‌ఐలను ప్రభుత్వం వీఆర్‌కు (రిజర్వ్‌కు) పంపింది. పోలీసు వ్యవస్థలో 'వైకాపా జాతర' ప్రభావం ఎంత ఉందో దీనిని బట్టి స్పష్టమవుతోంది.

₹100 కోట్ల బినామీ సామ్రాజ్యం:
దస్తగిరి నివాసంలో దొరికిన ₹100 కోట్ల సేల్ డీడ్లు కడప రాజకీయాల్లో భూకంపం సృష్టించాయి.

ఈ పత్రాల్లో ఉన్నవి జగన్ దగ్గరి బంధువు, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేర్లు!

నిత్యానందరెడ్డి ఆ మాజీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ కబ్జాల సామ్రాజ్యాన్ని నడిపించాడు.

బుగ్గవంక జలాశయం దగ్గర 35 ఎకరాల కబ్జా..

పోలీసు సంక్షేమ సంఘం స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్..

చింతకొమ్మదిన్నె, కడప మండలాల్లో ఆక్రమణలు..

ఈ హత్య కేవలం ఒక వ్యక్తిని చంపడం మాత్రమే కాదు, ఆ కబ్జాల చిట్టా బయటపడకుండా చేయడానికి జరిగిన ప్రయత్నం. దస్తగిరి ఇంట్లో దొరికిన ఆ డాక్యుమెంట్లు ఇప్పుడు జగన్ దగ్గరి బంధువు మాజీ ఎమ్మెల్యేను, నిత్యానందరెడ్డిని జైలుకు పంపే 'సాక్ష్యాలు'గా మారాయి.

వైకాపా జాతరలో మొదలైన ఈ నరమేధం, ఇప్పుడు ఆ పార్టీ 'పెద్ద తలకాయల' పీఠాన్ని కదిలిస్తోంది. ముసుగులు తొలగుతున్నాయి.. సూత్రధారుల అరెస్ట్ కోసం కడప వేచి చూస్తోంది!

ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ప...
20/04/2026

ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమము మరియు రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.

Address

Tiruvuru
521235

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Tiruvuru Town posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share