03/10/2026
📍 బీజేపీ ఆంధ్రప్రదేశ్ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ప్రభారీల సమావేశం
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ప్రభారీల సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ డా. అరవింద్ సింగ్ బదోరియా గారు, రాష్ట్ర కో-ఇన్‌చార్జ్ శ్రీమతి వనతి శ్రీనివాసన్ గారు, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సంఘటనా మంత్రి శ్రీ నూకల మధుకర్ జీ గారు, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ పాక వెంకట సత్యనారాయణ గారు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ మైనారిటీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సయ్యద్ బాషా గారు పాల్గొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి అధ్యక్షతన ఈ రాష్ట్రంలో గత ఏడాది కాలంగా రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అలాగే కేంద్రంలోని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలను మైనారిటీ వర్గాలకు చేరవేస్తున్న కార్యక్రమాల వివరాలను వివరించారు.
అలాగే రాష్ట్ర ఇన్‌చార్జ్ డా. అరవింద్ సింగ్ బదోరియా గారి జన్మదినం సందర్భంగా శ్రీ సయ్యద్ బాషా గారు వినాయకుని విగ్రహాన్ని బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ పైడి వేణుగోపాలం గారు ,ప్రధాన కార్యదర్శులు శ్రీ నన్నేసా హుస్సేన్ గారు, శ్రీ పి. ఫైరోజ్ ఖాన్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు.