30/09/2026
ఈ రోజు అనగా 30-09-2026 మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం రూరల్ మండలం లో ప్రధాన మంత్రి పుట్టినరోజు సందర్భంలో భాగంగా సేవ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఘనంగా రూరల్ మండల SC అధ్యక్షురాలు కోలవేంటి కల్పన ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నూతులపాటి బాలకోటేశ్వర రావు (బాల) గారు ముఖ్య అతిధిగా విచ్చేసి *అంగన్వాడి ఉత్సవం* ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు 25 ఏళ్ల ప్రజా సుపరిపాలన సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి నెలరోజులు *సేవా సంకల్ప అభియాన్* ఈ కేంద్రాలకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు,చిన్నారులకు ,గర్భిణులకు,బాలింతలకు సంక్షేమం కోసం మోదీ గారు అందిస్తున్న ఆర్థిక సహాయం గురించి వివరించారు శక్తివంతమైన ఆరోగ్యకరమైన యువతే *వికసిత్ భారత్ -2047* నిర్మాణానికి పునాది కావున నేడు కేంద్రం అంగన్వాడి వ్యవస్థలు బలోపేతం చేస్తున్నట్లు,మరియు ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించారు
ముఖ్యంగా చిన్నారుల్లో పౌష్టికాహారం కోసం, తల్లులు, పిల్లల ఆరోగ్య సంక్షేమం కోసం చేస్తున్న కృషి అభినందనీయం అని కొనియాడి అంగన్వాడి కేంద్రాలకు ఇంక ఏమైనా సహాయం కావాలన్న కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అని హామీ ఇచ్చారు.తదుపరి అంగన్వాడి టీచర్స మరియు సహాయకులను బీజేపీ నేతలు శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ అంగన్వాడి ఉత్సవం లో రూరల్ మండల అధ్యక్షురాలు పయ్యావుల జయలక్ష్మి రాము పాల్గొని అంగన్వాడి కేంద్రం గురించి పధకాల గురించి వివరించారు . ఈ కార్యక్రమానికి కొండపల్లి పట్టణ అధ్యక్షురాలు తమ్మినేని మాధురి ,బత్తుల సత్యనారాయణ గొల్లపూడి రూరల్ మండల అధ్యక్షులు దుద్దుకూరి తిరుపతి నాయుడు, రాజేంద్రప్రసాద్, ఆళ్లకుంట చిట్టి,గుంజ అనీల్, కునాల యుగంధర్, దాము
భవానీ సేనాపతి నాగమణి, కీర్తి, బెనర్జీ సత్తిరాజు,నరసింహారావు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.