18/09/2026
ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ఈరోజు మాత బాల భక్త సమాజం గణేష్ కట్ట మైసమ్మ గుడి శివాజీ నగర్ వినాయక మండపం వద్ద వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు టి .సదానంద రెడ్డి గారు మరియు మాజీ కౌన్సిలర్ శ్రీదేవి గార్ల ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ గారు, హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు, తెలంగాణ హిందూ జనశక్తి అధ్యక్షులు శ్రీనివాస్ గారు, వికారాబాద్ మండలాధ్యక్షులు శివరాజ్ గౌడ్ గారు, ఆధ్యాత్మిక సెల్ కన్వీనర్ ప్రవీణ్ గారు, నర్సింలు, భాస్కర్ రెడ్డి, డాక్టర్ స్వప్న గారు, స్వాతి గారు, కాలనీవాసులు , పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.