N. TEJA

Directions Website Contact the organization

N. TEJA DREAM AIM WORK

"వైభవంగా శ్రీ బంటమ్మ తల్లి వారాల వేడుకలు"బంగారు బంటుపల్లి గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ బంటమ్మ తల్లి వారి వారాల వేడుకలు భక్తి...
07/10/2026

"వైభవంగా శ్రీ బంటమ్మ తల్లి వారాల వేడుకలు"

బంగారు బంటుపల్లి గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ బంటమ్మ తల్లి వారి వారాల వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకలు, ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమాలకు ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నడుకుదిటి ఈశ్వరరావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ లంక శ్యామలరావు గారు, కూటమి నాయకులు పిషిని జగన్నాథం నాయుడు గారు, కనకారావు గారు, అనంత్ మహంత్ గారు, జక్కంపూడి బంగార్రాజు గారు తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, NER యువత పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

"అక్టోబర్ 2నమెగా రక్తదాన శిబిరం"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్...
26/09/2026

"అక్టోబర్ 2న
మెగా రక్తదాన శిబిరం"

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సేవా సంకల్ప్ అభియాన్” లో భాగంగా ఈ నెల 27న జరగాల్సిన మెగా రక్తదాన శిబిరాన్ని... అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అక్టోబర్ 2వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.

ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నడుకుదిటి ఈశ్వరరావు గారి పిలుపు మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల కూటమి నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావలసిందిగా కోరుకుంటున్నాము.

ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలనే మన ఎమ్మెల్యే NER గారి సేవా స్ఫూర్తితో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. 1,000 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో మీరంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని కోరుకుంటున్నాము.

ఇట్లు
నడుకుదిటి తేజ బాబు,
సేవా సంకల్ప్ అభియాన్
శ్రీకాకుళం జిల్లా కో-కన్వీనర్.

"ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి"పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య...
25/09/2026

"ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి"

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎచ్చెర్ల శాసనసభ్యులు శ్రీ నడుకుదిటి ఈశ్వరరావు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు సూచించిన అంత్యోదయ స్ఫూర్తి, ఏకాత్మ మానవతావాదం మార్గదర్శకాలుగా తీసుకుని మనమంతా నడుచుకోవాలని సూచించారు.

ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల మండల అధ్యక్షులు, ఇన్‌చార్జీలు, కోర్ కమిటీ సభ్యులు, BLA-2లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

25/09/2026

"ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి"

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎచ్చెర్ల శాసనసభ్యులు శ్రీ నడుకుదిటి ఈశ్వరరావు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు సూచించిన అంత్యోదయ స్ఫూర్తి, ఏకాత్మ మానవతావాదం మార్గదర్శకాలుగా తీసుకుని మనమంతా నడుచుకోవాలని సూచించారు.

ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల మండల అధ్యక్షులు, ఇన్‌చార్జీలు, కోర్ కమిటీ సభ్యులు, BLA-2లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఎచ్చెర్ల నియోజకవర్గబీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం..!భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పితామహులు, మహనీయులు పండిత్ దీన్‌దయా...
24/09/2026

ఎచ్చెర్ల నియోజకవర్గ
బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం..!

భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పితామహులు, మహనీయులు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా రేపు ఉదయం 10:00 గంటలకు మన ఎచ్చెర్ల శాసనసభ్యులు శ్రీ నడుకుదిటి ఈశ్వరరావు గారి క్యాంపు కార్యాలయం వద్ద జయంతి వేడుకలను నిర్వహిస్తున్నాము.

ఈ కార్యక్రమానికి ఎచ్చెర్ల నియోజకవర్గంలోని కోర్ కమిటీ సభ్యులు, నాయకులు, BLA-2 లు, కార్యకర్తలు అందరూ తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.

ఇట్లు
నడుకుదిటి తేజ బాబు,
BJP BLA-1, ఎచ్చెర్ల నియోజకవర్గం.

18/09/2026

*"ఘనంగా ప్రధాని మోదీ గారి జన్మదిన వేడుకలు"*

*ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి* జన్మదినాన్ని పురస్కరించుకుని *రణస్థలం మండలం బంగారు బంటుపల్లి గ్రామం* లో ఘనంగా వేడుకలు నిర్వహించాము.

*సేవా సంకల్ప్ అభియాన్* లో భాగంగా వందలాది దీపాలతో ‘ఆశీర్వాద దీపం’ వెలిగించి, మోదీ గారికి ఆయురారోగ్యాలు కలగాలని, *వికసిత్ భారత్-2047 సంకల్పం* నెరవేరాలని ఆకాంక్షించాము.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి రజినీ NER గారు, రణస్థలం మండలం బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

27/03/2026

Address

1-2 Nadukuditi Palem , Bantupalli
Vizianagaram
532407

Alerts

Be the first to know and let us send you an email when N. TEJA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to N. TEJA:

Shortcuts

Share

Category