22/09/2026
చీపురుపల్లి మండల ఎంపీటీసీల పదవీకాలం ముగియనున్న సందర్భంగా మండల కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఎంపీటీసీలను సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా తమ పదవీకాలంలో ప్రజలకు అందించిన సేవలను అభినందించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించడం జరిగింది.
శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి సూచనలతో రానున్న రోజుల్లో నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి మా వంతు సహకారం అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇప్పిలి వేంకటనరసమ్మ గారు, శ్రీ అనంత్ గారి దంపతులు, శ్రీ వరహాల నాయుడు గారు, వైస్ ఎంపీపీలు శ్రీ శ్రీను గారు, శ్రీ రాజారావు గారు, శ్రీ జనార్దన్ గారు, శ్రీ అధికార్ల శ్రీను గారు, మండల ముఖ్య నాయకులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, మాజీ వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.