Bhanuprakash TNSF

Call Directions Contact the organization

Bhanuprakash TNSF Ex TNSF విజయనగరం ప్రధాన కార్యదర్శి
విజయనగరం పార్లమెంట్

18/09/2026

నాకు పోన్ చేసి మేడమ్ మీద ఆ పోస్ట్ ఎవరు పెట్టమన్నారు అంటారు ఏంట్రా.?
నాకు ఆవిడ మేడమ్ ఏంటి.?నాకు ఏమైనా జీతం ఇస్తుందా.?
నీలాంటి 12 వేల జీతగాన్నా నేను,వెళ్లి ఆవిడ వీడియోలు చేసుకొని,వీడియో కి ఓ 500 ఎగస్ర్టా కొట్టమను..

అరిగిపోయిన చెప్పులు దగ్గర నుంచి స్టాకు ఓ పది జతల చెప్పులు సంపాదించుకోవడం కాదు రాజకీయం..

ఉన్న స్థానం నుంచి ఏ స్థానం కి వచ్చారో మర్చిపోతే ఎలా.?

కార్యకర్తలే అధినేతలు,కార్యకర్తలే దేవుళ్లు అని పార్టీ చెబుతుంటే,…
తోలు తీస్తా,తొక్క తీస్తా.?ఎండగడట,పచ్చడి పెడతా అంటే ..ఎవడు ఊరుకుంటారు.?

పార్టీ లో ప్రయారిటీ లేదని మొత్తుకున్న వాళ్లని పక్కన పెట్టారు,
మాకు గుర్తింపు లేదని మంగళగిరి పార్టీ ఆపీస్ లో కంప్లైంట్ ఇస్తే ,
పార్టీ ఆపీస్ లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్లని పోలీష్ స్టేషన్ కి పిలిచి కొడతాం అని వార్నింగ్ లు ఇస్తున్నారు

పార్టీ అధికారంలో లేనప్పుడు అండగా ఉన్న కార్యకర్తలకు పోలీస్ స్టేషన్ లో అవమానాలే పార్టీ గుర్తింపా.?

ఇలాంటి నాయకులను ఏం చేయాలో త్వరలో కార్యకర్తలే బుద్ది చెబుతారు.

Nara Lokesh అన్న
Nara Chandrababu Naidu గారు
Srinivasarao Palla గారు

14/08/2026
14/08/2026

ప్రజల పేరుతో ఊరిని దోచుకోవడమే నాయకత్వమా?
అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడడమే ప్రజాసేవనా?
స్వార్థమే ఊపిరిగా, దోపిడీయే ధ్యేయంగా సాగే పాలన నిజమైన నాయకత్వం కానే కాదు!"

25/07/2026

Power of Youth

స్టూడెంట్ పవర్….🔥

విపక్షాలకు సాధ్యం కాలేదు.. సెంట్రల్ను షేక్ చేసిన స్టూడెంట్ పవర్

విద్యార్థులు తలుచుకుంటే ఏమైనా సాధ్యమేనని మరోసారి నిరూపితమైంది. ఎండల్లో ఎండుతూ, వానలకు తడుస్తూ, లాఠీ దెబ్బలను తట్టుకొని, టియర్ గ్యాస్ బాధను ఓర్చుకొని అనుకున్నది సాధించారు. ప్రతిపక్షాలకు సాధ్యం కాని రీతిలో అనితర పోరాటం చేసి కేంద్రం దిగి వచ్చేలా చేశారు. పేపర్ లీకేజీలు సహా మరేవైనా విద్యార్థుల భవిష్య త్తుతో ఆడుకొనే చర్యలకు ఉపేక్షించబోమని హెచ్చరించారు. ధర్మేంద్ర రాజీనామాతో దేశంలో నవశకం మొదలైంది.

ప్రియమైన యువతకు ఒక చిన్న హితవు...రాజకీయాలు సమాజ సేవకు గొప్ప వేదిక. కానీ చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు మరియు వ్యక్తిగత ...
11/07/2026

ప్రియమైన యువతకు ఒక చిన్న హితవు...

రాజకీయాలు సమాజ సేవకు గొప్ప వేదిక.
కానీ చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు మరియు వ్యక్తిగత అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయాలనే జీవితంగా భావించడం సరైన నిర్ణయం కాదు.

ముందుగా మీ భవిష్యత్తును బలంగా నిర్మించుకోండి. మంచి విద్య, నైపుణ్యాలు, ఆర్థిక స్థిరత్వం సాధించండి.

ఆ తర్వాత సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వస్తే మరింత ప్రభావవంతంగా ప్రజలకు సేవ చేయగలుగుతారు.

రాజకీయాలు మీ భవిష్యత్తును నిర్మించాలి గానీ, మీ భవిష్యత్తును నాశనం చేయకూడదు.

"ముందు జీవితంలో స్థిరపడండి... తర్వాత ప్రజల కోసం నిలబడండి."

యువత విజయవంతమైతేనే సమాజం విజయవంతమవుతుంది.

🚨 ఓటర్లకు అత్యవసర హెచ్చరిక! 🗳️⏳ ఇంకా 10రోజులే!ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా...
04/07/2026

🚨 ఓటర్లకు అత్యవసర హెచ్చరిక! 🗳️

⏳ ఇంకా 10రోజులే!

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా మీకు అందిన Enumeration Form ను తప్పనిసరిగా పూర్తి చేసి జూలై 14లోపు మీ ప్రాంత BLO (Booth Level Officer) కు అందజేయండి.

📌 ఇప్పటివరకు రాష్ట్రంలోని 4.16 కోట్ల ఓటర్లలో కేవలం 1.56 కోట్ల మంది (37.66%) మాత్రమే ఫారాలను సమర్పించారు.

⚠️ గడువులోగా ఫారం సమర్పించకపోతే, జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయే అవకాశం ఉంది. దీంతో మీ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.

✅ వెంటనే మీ ఫారం పూర్తి చేసి సమర్పించండి.
🗳️ మీ ఓటు – మీ హక్కు – మీ బాధ్యత.

📢 ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి.

💙 Common Man MadugulaBhanu Prakash
👉 For More Updates Follow

News via  : జగన్ అబద్ధాలకు అంబాసిడర్... సాక్షి అసత్యాలకు వేదిక - మంత్రి అచ్చెన్నాయుడుhttps://app.mytdpapp.com/share/post...
03/07/2026

News via : జగన్ అబద్ధాలకు అంబాసిడర్... సాక్షి అసత్యాలకు వేదిక - మంత్రి అచ్చెన్నాయుడు

https://app.mytdpapp.com/share/post/0QWJHQZ80VEA9

03/07/2026

రాజకీయాలలో ఉన్న వాళ్ళ బలం బలహీనత రెండూ రాజకీయమే....
మిగిలిన రంగాలలో రాణించినంత సులువు కాదు రాజకీయాలలో గెలవటం ...
జీవితం మొత్తాన్ని పణంగా పెట్టాల్సి ఉంటుంది....
అయినా గెలుస్తామనే నమ్మకం ఉండదు....
కేవలం మనకంటూ ఓ రోజు వస్తుంది అనే చిన్న ఆశతో ఇక్కడ నిలబడాలి..
ఒక్కొక్కసారి అయిన వాళ్ళని కూడా వదులుకోవాల్సి వస్తుంది.....
కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయడం అనేది ఖచ్చితం అయిపోతుంది......
చాలా మంది స్నేహితులు ఉంటారు కానీ చాలా తక్కువ మంది సహాయ పడతారు....
పార్టీల కోసం లక్షల ఖర్చుకు వెయ్యని లెక్కలు పిల్లలకి వేల ఖర్చు విషయంలో వెయ్యాల్సి వస్తుంది....
వేల మంది జనం మధ్య ఉన్నా వందల మందితో కలిసి పనిచేస్తున్నా ఎప్పుడూ ఒంటరితనం వెక్కిరిస్తూ ఉంటుంది...
ఆకాశానికి ఎత్తే పొడగ్తలు పాతాళానికి పడేసే అవమానాలు రెండింటినీ చూడవలసి ఉంటుంది...
అర్థరాత్రి దాటినా నిద్ర అనే ఊసే ఉండదు..
ఖాళీగానే కాలం గడిపోతున్నట్లు ఉంటుంది....
కానీ క్షణం తీరిక ఉండదు... దమ్మిడీ ఆదాయం ఉండదు
వ్యక్తిగత వ్యాపారాల ఆదాయ మార్గాలు కూడా కొద్ది కొద్దిగా మూసుకునిపోతూ ఉంటాయి...

రాజకీయాలలో బ్రతకాలంటే భయపడకండి.....
భయపడే వాళైతే ఇక్కడకు రాకండి....

Address

Phool Baugh Colony
Vizianagaram
535002

Telephone

+919398919587

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhanuprakash TNSF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhanuprakash TNSF:

Shortcuts

Share