20/08/2026
08-08-2026
జూరాల ప్రాజెక్టు కు వరద ప్రవాహము మొదలైన వెంటనే 27 జూలై రోజు నుండి జూరాలపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు , నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పంపింగ్ ప్రారంభించబడింది. జూరాల కెనాల్స్ కు 29 వ తేదీ నీటి విడుదల చేయడం జరిగినది. వరద ప్రవాహము ఉన్నంతవరకు ఎటువంటి ఆటంకము లేకుండా నీటి విడుదల మరియు పంపింగ్ జరుగును.ఈరోజు వరకు జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, మరియు కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు 5.4 TMC పంపింగ్ చేయడం జరిగినది . నెట్టెంపాడు ప్రాజెక్టు లో 4 పంపులు 750 క్యూసెక్కుల సామర్థ్యం తో మొత్తం 3000 క్యూసెక్కులు ఎత్తిపోయవచ్చును. అయితే రేలంపాడు రిజర్వాయర్ లీకేజీ సమస్యవల్ల2 TMC మాత్రమే నిల్వ చేసుకునే అవకాశము కలదుమరియు గూడెం దొడ్డి రిజర్వాయ్ సామర్థ్యము కూడా 1 TMC మాత్రమే.అందువలన ఇక్కడ గత 5 సంవత్సరాలనుండి2 పంపులు మాత్రమే నడపడం జరుగుచున్నది.మొదట 2 పంపులు నడపడం జరిగినది. రిజర్వాయర్నిండినందువలన, నీటి విడుదలను అనుసరించి ఇప్పుడు ఒక పంపు నడుపబడుచున్నది.భీమా ప్రాజెక్టు స్టేజ్ 2 లో తిరుమలయపల్లి దగ్గర 3పంపులు 750 క్యూసెక్కుల సామర్థ్యం కలిగి ఉన్నాయి.వీటిలో 2 పంపులు వాడుకకు మరియు 1 స్టాండ్బై.2 పంపుల ద్వారా 1500 క్యూసెక్స్ పంపు చేయవచ్చు. అయితే శంకసముద్రం రిజర్వాయ్ పూర్తి కాక పోవడము వలన మరియు ఏనుకుంట కెపాసిటీ కేవలం 0.1 TMC ఉండడం వలనఇక్కడ కూడా 1 పంపు మాత్రమే మొదటినుండి నడపబడుచున్నది.స్టేజ్ 2 కొత్తకోట దగ్గర 318 క్యూసెక్కుల సామర్థ్యం గల 3 పంపులు కలవు. దీనిలో 1 పంపు స్టాండ్బై.2 పంపులు వాడుకకు కలవు.2 పంపులు నడపబడుచున్నవి. రిజర్వాయ్ సామర్థ్యము, మరియు నీటి నిల్వ, విడుదలను బట్టి పంపులు అవసరానికి తగినంత నడుపు తున్నాము రైతులు ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయము ఏమనగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో వరి సాగు చేయకుండా, ఆరుతడి పంటలు పండించుకోవలసిందిగా కోరుతున్నాము. రాబోయే రోజుల్లో నీటి విడుదల అనేది వరద ప్రవాహము పై ఆధారపడి ఉంటుంది. మనకు వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విషయం దృష్టిలో పెట్టుకోవాల్సినదిగా కోరుతున్నాము. నీటి విడుదల అనేది ముఖ్యముగా చెరువులు నింపుకోవడానికి మరియు త్రాగునీటి అవసరాలకు రాబోయే రోజుల్లో జాగ్రత్తపడాడానికి, పొదుపుగా వాడుకోవలసినదిగా కోరుతున్నాము.
మొహమ్మద్. రహీముద్దీన్- చీఫ్ ఇంజినీర్, వనపర్తి
సెల్ నెంబర్ -9989964419