godarollamandi

Call Directions

godarollamandi You can see about the culture, traditions, historical places of Godavari districts
(1)

సరిగ్గా ఉదయం 8 గంటలకు ఓపెన్ చేస్తాడు.. ఇదిగో అని ఇలా చూడగానే అయిపోతున్నాయ్... మీకు బుక్ అయ్యాయా టిక్కెట్లు ?
09/11/2026

సరిగ్గా ఉదయం 8 గంటలకు ఓపెన్ చేస్తాడు.. ఇదిగో అని ఇలా చూడగానే అయిపోతున్నాయ్... మీకు బుక్ అయ్యాయా టిక్కెట్లు ?

ఇప్పుడు వాళ్ళకి నూటికి తొంభై తొమ్మిది మందికి తెలీదు ఇది ఏంటో కూడా... దీపావళికి మన పెద్దవాళ్ళు ఎక్కువగా చేసేవారు. దీనిని ...
08/11/2026

ఇప్పుడు వాళ్ళకి నూటికి తొంభై తొమ్మిది మందికి తెలీదు ఇది ఏంటో కూడా... దీపావళికి మన పెద్దవాళ్ళు ఎక్కువగా చేసేవారు.
దీనిని తిప్పుడు పొట్లం అంటారు.. నువ్వు పదివేలు పెట్టి కొని కాల్చిన దానికంటే ఒక తిప్పుడు పొట్లం చివరకు ఉంచితే మహా గ్రేట్.
దీనిని ఎంత గట్టిగా తిప్పితే అంత అందం అసలు 😍😍.

కొబ్బరి పొట్టు, బొగ్గు, ఉప్పు కలిపి నూరి పేడతో అలికిన గుడ్డలో , ఈ నూరిన పిండిని ఆ గుడ్డలో కట్టి పూతరేకు చుట్టినట్టు చుడతారు .
ఈ చుట్టిన పొట్లాన్ని కొబ్బరి మట్ట నాలుగు పలకలుగా చీల్చి ఆ మట్టలోంచి జారిపోకుండా తాడుతో కడతారు.

అలా కట్టిన దానికి చివర్లో నిప్పు అంటించి తిప్పుతారు, అలా తిప్పగా తిప్పగా నిప్పు రాజుకుని, నిప్పు రవ్వలు చిందుతాయి..

పేలుడు పదార్థం కాదు, కాకపోతే కాలిప్రదేశంలో దీనిని తిప్పితే వచ్చే కిక్కు వేరండి అసలు.. వీదంతా కాంతులు వెదజల్లుతూ రాలే నిప్పురవ్వలు చూడటానికి భలే ఉంటుంది. మీకు ఇది తిప్పిన అనుభవం ఉంటే కామెంట్ చెయ్యండి.

సిన్నతనంలో దసరాసెలవులప్పుడు ఈటిల్ని తయారు సేసేవోళ్ళమండి. దీపాళికి ముందే ఈ సిసింద్రీలు తయారు సేసేవోళ్ళమండి. తోటిప్రెండ్సు...
07/11/2026

సిన్నతనంలో దసరాసెలవులప్పుడు ఈటిల్ని తయారు సేసేవోళ్ళమండి. దీపాళికి ముందే ఈ సిసింద్రీలు తయారు సేసేవోళ్ళమండి. తోటిప్రెండ్సుతోటి ఈట్లిషయంలో
గట్టి పోటీ ఉండేదండి. మందుపాళ్ళు కల్పటం సరింగా కుదరాపోయినా గుల్లలలోకి మందు సరింగా కూరాపోయినా అయ్యి ఎగిరేయి కాదండి.

ఆటిల్ని ఓ సివరెలిగించి గాల్లోకి కొద్దిగా ఎగరెయ్యటం వరకే మనొంతండి. ఆ తర్వాత అయ్యెటెగుర్తాయో ఆట్లిష్టమండి. కుదురుండకుండా సిన్నతనంలో అల్లరిసేసే పిల్లల్ని సిసింద్రీలనేవోరండి. ఈ సిసింద్రీల్ని ఇళ్ళకాడ కాల్చనిచ్చేవోరు కాదండి బాబు. ఎంచేతంటే అప్పట్లో తాటాకిల్లు ఎక్కువండి ఆయ్ మళ్ళీ ఇయ్యెల్లి ఆఇళ్ళమీదడితే ఇళ్ళంటుకుపోతాయన్న బయవండి ఒకోసారి అలాక్కూడా జరిగేయండి. గడ్డిమేట్లుకి కూడా ఇలాగే బయపడేవోరండి. కొబ్బరి బోడకాయి డొక్కలని గానీ.. ఎండిన జిల్లేడు పుల్లలు కానీ... ఎండిన వంగ మొక్కల మోడులు గానీ కాల్చి బొగ్గులు సేసి... తర్వాత ఆటిని కలంలో గానీ ..గచ్చుమీద గానీ నూరి గుడ్డతో జల్లించి మెత్తని బొగ్గు పొడి తయార్సేసేవోళ్ళమండి. ఏడొంతుల బొగ్గు పొడికి ..రొండొంతుల సూరేకారం...
అరొంతు గంధకం కలిపి సుమారు రెండంగులాల పొడవుండే సన్నపాటి కాయితం గుల్లల్లో కూరేవోళ్ళమండి. ఈ కాయితం గుల్లలు తయారీ అప్పుడే ఓయేపు మూసుంటాయండి రెండోఏపునుంచి మందుకూరి ఆఖర్లో కొంచెం ఖాలీ ఉండగానే ఆ గొట్టం కాయితాన్ని మందు బయటకొచ్చేయకుండా కూరేవోల్లమండి.
ఈ సిసింద్రీ ఓఏపు లావుండి..రెండో ఏపు సన్నగా ఉండేదండి ఓ డొక్కతాడు ముక్కని ఓ ఏపు అంటించి ఆనిప్పుకి సిసింద్రీ సన్నంగా ఉన్నాఏపు నోటితో గానీ .. సేత్తోగానీ కట్సేసి ఎలిగించాక గాల్లోకి ఎగరేసేవోళ్ళమండి. ఎవరియ్యి బాగా ఎగిరితే ఆళ్ళు గొప్పగా ఫీలయ్యేవోళ్ళండి ఆరోజుల్లో... ఈ మధుర జ్ఞాపకాలు మీకు గుర్తున్నాయా అండి.

వీరవాసరంలో ఘనంగా జరిగిన ఏనుగు సంబరం. పెద్ద నుండి పిల్లలు వరకూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపించే ఈ సంబరాన్ని మీరెప్పుడైనా చూస...
07/11/2026

వీరవాసరంలో ఘనంగా జరిగిన ఏనుగు సంబరం. పెద్ద నుండి పిల్లలు వరకూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపించే ఈ సంబరాన్ని మీరెప్పుడైనా చూసారా?

ఇలా సారి తెచ్చుకున్నప్పుడు ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు, పిల్లలు క్యాన్ లో ఐటమ్స్ అన్నీ వేసుకుని బంధువుల ఇంటికి వెళ్ళి పంచిప...
05/11/2026

ఇలా సారి తెచ్చుకున్నప్పుడు ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు, పిల్లలు క్యాన్ లో ఐటమ్స్ అన్నీ వేసుకుని బంధువుల ఇంటికి వెళ్ళి పంచిపెడతారు.
ఇక్కడ చూస్తున్నది చంటిబిడ్డ సారే... పుట్టింటివారు అమ్మాయికి బిడ్డపుట్టి అత్తవారింటికి వెళ్లేటప్పుడు కావలసిన అన్ని సదుపాయాలు అంటే మంచం, బీరువా, డైనింగ్ టేబుల్ ఇలా మొదలైనవి పెడతారు అలానే వాటితో పాటు తీపి కూడా పెడతారు అందులో ఏముంటాయి అంటే రెండు లేదా మూడు రకాల స్వీట్లు, చలివిడి, పసుపు, కుంకుమ, నలుగుపిండి వాటితో పాటు ఒక ఆట వస్తువు. ఇందులో అబ్బాయి అయితే బాల్ అమ్మాయి అయితే క్లిప్పులు వగైరా వేస్తారు. ఈ సారె ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు తెచ్చుకుంటారు. కొన్ని సంప్రదాయాలు, ఆనవాయితీలు నేటికి పల్లెటూర్లలో పాటిస్తున్నారు.
మీరెప్పుడైనా సారి పంచిపెడతానికి వెళ్ళారా?

ఈ నోట్లు చాలామణిలో ఉన్నప్పుడు ఆరోజుల్లోనే రూపాయితో సంతకెళ్తే ఇంటికి కలవసిన సరుకులన్నీ వచ్చేవట. 100 కాయితం పట్టుకెళ్తే హా...
04/11/2026

ఈ నోట్లు చాలామణిలో ఉన్నప్పుడు ఆరోజుల్లోనే రూపాయితో సంతకెళ్తే ఇంటికి కలవసిన సరుకులన్నీ వచ్చేవట. 100 కాయితం పట్టుకెళ్తే హాస్పిటల్ లో ఖర్చుకి సరిపోయేదంట అయినా అప్పుడు డబ్బు విలువ వేరులే...
మీరు చూసారా ఈ నోట్లని ఎప్పుడైనా ?

పాలకొల్లు పెద్దగోపురం పక్క సందు నుంచి తిన్నగా వెళ్లి పక్కకు తిరిగితే ఆనంద సాయి స్వీట్స్ షాప్ ముందు ఒక ఫాస్ట్ ఫుడ్ బండి ఉ...
03/11/2026

పాలకొల్లు పెద్దగోపురం పక్క సందు నుంచి తిన్నగా వెళ్లి పక్కకు తిరిగితే ఆనంద సాయి స్వీట్స్ షాప్ ముందు ఒక ఫాస్ట్ ఫుడ్ బండి ఉంటాదండి.. అక్కడ వేస్తారు ఈ చిట్టి అప్పడాలు అలా ప్లేట్ ఇవ్వగానే ఇలా అయిపోతాయి. మీలో ఎంతమంది తిన్నారు ఇవి.

Cyclone updates chala mandi pages share chesaru. Kaani mana Godavari districts lo jarige prathi vishayanni genuine ga co...
02/11/2026

Cyclone updates chala mandi pages share chesaru. Kaani mana Godavari districts lo jarige prathi vishayanni genuine ga cover chesthu, responsible ga information share chese pages konni matrame unnayi. Alanti pages lo Godavari Official , ILoveWestGodavari Amalapuram || Konaseema 🌴📸🎥 , Godavari Junction mundu varusalo untayi.

Mana godavari vallu chala mandi Hyderabad, Bangalore, Chennai lanti cities lo jobs chesthu untaru. Cyclone time lo mana oorilo situation ela undhi? Intlo family members safe ga unnara? Ani chala mandi tension and panic ki ayyaru.

Alanti time lo veellu regular ga ground-level videos, local situation updates and useful information share chesthu, people ki timely updates and alerts andincharu.

Internet and electricity sarigga leni difficult situations lo kuda possible ayinantha active ga updates provide cheyadaniki effort pettaru.

For many people living away from their hometowns, these updates were more than just information. They were a way to stay connected to their families and their villages.

Social media lo local pages responsibility entha important anedhaniki veellu manchi example.

Their hard work, dedication and efforts truly deserve appreciation. Keep up the good work! ❤️👏

మీకు గుర్తించే మొదటి విషయం ఏమిటి?
01/11/2026

మీకు గుర్తించే మొదటి విషయం ఏమిటి?

Social media lo chala mandi influencers and content creators unnaru. Kaani nijanga prajalaku upayogapade content create ...
31/10/2026

Social media lo chala mandi influencers and content creators unnaru. Kaani nijanga prajalaku upayogapade content create chesevaaru chaala takkuva.

Alanti vaarilo Weather Man’s mundu varusalo untaru. Regular weather reports, live updates tho paatu, recent ga vachina samayam lo kuda eppatikappudu weather updates share chesthu, prajalanu alert chesthu entho responsible ga vyavaharincharu.

TV lo news chuse avakasam leni situations lo kuda, Instagram lo veeri updates follow avuthu latest weather information telusukunevadini.

Social media ni kevalam entertainment kosame kaakunda, avasaramaina samayam lo prajalaku useful information and timely alerts andinche platform ga kuda upayoginchavachani veeru prove chesaru.

Your dedication and commitment to keeping people informed and safe are truly commendable. Thank you for your valuable service! ❤️👏

Sai Praneeth Sai Kiran Suri Benny Srikakulam Weatherman

Address

West Godavari District
534266

Telephone

+918499848656

Website

Alerts

Be the first to know and let us send you an email when godarollamandi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share