Oman Telangana Friends

Directions Website Contact the organization

Oman Telangana Friends సేవే మా లక్ష్యం

Service is our goal

హైదరాబాద్ లోని పాస్పోర్ట్ కార్యాలయంలో ఉన్న ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రాంట్ POE అధికారి శ్రీ ఆనంద్ దేవులపల్లి గారిని మర్యాద పూ...
07/10/2026

హైదరాబాద్ లోని పాస్పోర్ట్ కార్యాలయంలో ఉన్న ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రాంట్ POE అధికారి శ్రీ ఆనంద్ దేవులపల్లి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. నరేంద్ర పన్నీరు...

గల్ఫ్ జేఏసీ నాయకుడు నరేంద్ర పన్నీరు కు‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ వేదికపై సన్మానం◉ ఎన్నారైలు, గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ...
07/10/2026

గల్ఫ్ జేఏసీ నాయకుడు నరేంద్ర పన్నీరు కు
‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ వేదికపై సన్మానం

◉ ఎన్నారైలు, గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఆత్మవిశ్వాసం, భరోసా, స్వాంతన

ఓమాన్ రిటర్నీ, గల్ఫ్ జేఏసీ నాయకుడు నరేంద్ర పన్నీరు 29 సెప్టెంబర్ 2026న హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ హెల్ప్‌డెస్క్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా నరేంద్ర పన్నీరు ను తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్ల శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ, విదేశాల్లో భారత రాయబార కార్యాలయాలు నిర్వహిస్తున్న ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాల తరహాలో తెలంగాణ రాష్ట్రంలో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు, గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి మార్గం చూపేందుకు ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ఒక అనుసంధాన వేదికగా నిలుస్తోందని స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నారు.

ఈ వేదిక ద్వారా తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేసుకునే అవకాశం లభించడం వల్ల ఎన్నారైలు, గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఆత్మవిశ్వాసం, భరోసా, స్వాంతన కలుగుతున్నాయని మంద భీంరెడ్డి తెలిపారు.

Government of Telangana
State-Level CM Pravasi Prajavani
(Session No. 258, Tue, 29.09.2026)

Swadesh Parkipandla
Narendra Panneru

పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిల్స్ పంపిణీOman Telangana Friends...
12/05/2025

పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిల్స్ పంపిణీ
Oman Telangana Friends...

🙏జై శ్రీరాం!!!శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి ౹౹అర్జునస్య ధనుర్దారి రామస్య ప్రియదర్శిని౹౹మీరు తలపెట్టిన ప్రతి పనిలో వి...
12/10/2024

🙏జై శ్రీరాం!!!

శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి ౹౹అర్జునస్య ధనుర్దారి రామస్య ప్రియదర్శిని౹౹

మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ...

మీకు మీ కుటుంబ సభ్యులందరికి విజయదశమి శుభాకాంక్షలు

आपको और आपके परिवार के सभी सदस्यों को दशहरा की बहुत-बहुत शुभकामनाएँ

A very happy Dussehra to you and all your family members

Narendra panneru
Convener -Middle East
BJP Telangana NRI Cell

Vishwa Hindhu Mahasangh
Incharge-Telangana

Gulf Country - కువైట్ అగ్నిప్రమాదం.. బాధిత కుటుంబాలకు AP Govt పరిహారం ప్రకటనకువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబా...
15/06/2024

Gulf Country - కువైట్ అగ్నిప్రమాదం.. బాధిత కుటుంబాలకు AP Govt పరిహారం ప్రకటన

కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

ఏపీకి చెందిన ముగ్గురు కార్మికులు చనిపోగా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

కాగా మొత్తం 45 మంది భారతీయులు ఈ ప్రమాదంలో చనిపోగా వారి మృతదేహాలు ఇవాళ స్వదేశానికి చేరుకున్నాయి.

ఒమాన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలుఒమాన్ లో ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కార్యదర్శి చేని ప్రభాకర్ గారు  ఘనంగా రాఖీ పౌర్ణ...
01/09/2023

ఒమాన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు

ఒమాన్ లో ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కార్యదర్శి చేని ప్రభాకర్ గారు ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరిగింది .ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ అన్న,తమ్ముళ్లు మరియు ఒమాన్ తెలంగాణా ఫ్రెండ్స్ మిత్రులు ఒకరికి ఒకరు నాకు నీవు రక్షా నీకు నేను రక్షా అంటూ రాఖీ కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు ఒమాన్ లో ఉన్న తెలుగువారందరికి శుభాకాంక్షలు తెలుపుతూ క్షేమంగా ఉండాలని వారికి సహకరించడానికి ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంధని సందేశాన్ని పంపారు. ఉపాధ్యక్షులు మంచికట్ల కుమార్ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ సేవలు అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో చేని . ప్రభాకర్ , కోట . నర్సింలు, చింత కుంట.నగేష్ , సందీప్ మరియు ఒమన్ తెలంగాణా ఫ్రెండ్స్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ రోజు బుధవారం, తేది: 23.08.2023 నాడు ఉదయం ఓమాన్ ఏర్ ఫ్లయిట్ లో కీ. శే. తర్రే గంగారాజం(50) గారి మృతదేహం కలిగిన శవపేటిక మ...
23/08/2023

ఈ రోజు బుధవారం, తేది: 23.08.2023 నాడు ఉదయం ఓమాన్ ఏర్ ఫ్లయిట్ లో కీ. శే. తర్రే గంగారాజం(50) గారి మృతదేహం కలిగిన శవపేటిక మస్కట్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నది.

గల్ఫ్ జేఏసీ నాయకులు, ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు, తెలంగాణ బిజెపి ఎన్నారై సెల్ గల్ఫ్, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు గారు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ఎయిర్ కార్గోలో శవపేటిక తీసుకోవడానికి కావలసిన అన్ని విధివిధానాలు పూర్తి చేయించారు. హెల్త్ క్లియరెన్స్, కస్టమ్స్ క్లియరెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోని శవపేటిక ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నారై విభాగం వారి ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి కీ. శే. తరె గంగారాజం గారి స్వస్థలం గొర్రెగుండం గ్రామం, మాల్యాల మండలం, జగిత్యాల జిల్లా వరకు పంపించారు.

మస్కట్ లోని స్వామి బృందం తో ఇక్కడ వంకాయల కార్తీక్ తో సమన్వయము చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ గల్ఫ్ మృతుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే హామీ ఇచ్చిన ప్రకారం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని నరేంద్ర పన్నీరు డిమాండ్ చేశారు.

.🙏జై శ్రీరాం!!!మీకు మీ కుటుంబ సభ్యలందరికి  మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు.ఈ పండుగ మనందరి జీవితాల్లో కొత్త శక్తిని, విజయ...
15/01/2023

.🙏జై శ్రీరాం!!!

మీకు మీ కుటుంబ సభ్యలందరికి మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు.

ఈ పండుగ మనందరి జీవితాల్లో కొత్త శక్తిని, విజయాన్ని, కీర్తిని పొందేలా చూడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

Happy Makar Sankranti to you and all your family members.

I pray to God that this festival brings new energy, success and glory in all our lives.

आपको और आपके परिवार के सभी सदस्यों को मकर संक्रांति की हार्दिक शुभकामनाएं।

मैं ईश्वर से प्रार्थना करता हूं कि यह पर्व हम सभी के जीवन में नई ऊर्जा, सफलता और वैभव लाए।

Dr. NARENDRA PANNERU
Convener - Middle East
BJP Telangana NRI Cell

New covid guidelines for international passengers arriving at Hyderabad Airport...
23/12/2022

New covid guidelines for international passengers arriving at Hyderabad Airport...

23/12/2022

Please take care...

Address

Muscat
112

Alerts

Be the first to know and let us send you an email when Oman Telangana Friends posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Oman Telangana Friends:

Shortcuts

Share