01/06/2026
తెలంగాణ మట్టిలో పుట్టి, తెలంగాణ కోసం జీవించి, తెలంగాణ కోసమే తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేనివి. వారి రక్తపు చుక్కలతో రాసుకున్న చరిత్రే నేటి తెలంగాణ రాష్ట్రం.
తల్లిదండ్రుల ఆశలను, కుటుంబాల ఆనందాలను, తమ భవిష్యత్తును సైతం త్యాగం చేసి "జై తెలంగాణ" నినాదంతో అమరులైన వీరుల త్యాగం ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. వారి ఆత్మబలిదానాల వెనుక ఉన్న బాధ, త్యాగం, ఆవేదనను గుర్తుచేసుకుంటే ప్రతి హృదయం చలించిపోతుంది.
ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ సాధన కోసం తమ అమూల్యమైన జీవితాలను అర్పించిన అమరవీరులను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిద్దాం.
వారి త్యాగఫలమే నేడు మన స్వరాష్ట్రం... వారి కలల తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే వారికి మనం అందించే నిజమైన నివాళి.
అమరవీరులు దూరమైనా...
వారి త్యాగ గాథలు మన హృదయాల్లో చిరంజీవులే...
వారి ఆశయాలు మన అడుగులకు దిక్సూచులే...
🌹 తెలంగాణ అమరవీరులకు అశ్రునివాళులు... ఘన నివాళులు... 🌹
"వీరుల త్యాగం వృథా కాదు...
వారి స్ఫూర్తి తెలంగాణ ఉన్నంత కాలం చిరస్థాయిగా వెలుగుతూనే ఉంటుంది."
జై తెలంగాణ!
జై జై తెలంగాణ!!
31/05/2026
*Telangana State Formation Day Celebrations 2026 Invitation*
Dear sir/madam,
The Indian Cultural Centre (ICC), Qatar, in association with Telangana Gulf Samithi Qatar, cordially invites you and your family to join the *Telangana State Formation Day Celebrations*
Come together to celebrate the pride, culture, heritage, and achievements of Telangana with fellow Telangana families in Qatar. Enjoy a vibrant evening filled with cultural performances, entertainment, community bonding, and the spirit of Telangana.
📅 Date: 03 June 2026 (Wednesday)
🕡 Time: 6:30 PM onwards
📍 Venue: ICC Ashoka Hall, Doha, Qatar
Your presence will make this celebration even more memorable.
Warm Regards,
Telangana Gulf Samithi Qatar
M.SandhyaRani
General Secretary
🌸 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం 🌸
ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) ఖతర్, తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ సహకారంతో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మీ కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, కళలు మరియు మన ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఈ ప్రత్యేక వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మక ప్రదర్శనలు, స్నేహసమ్మేళనం మరియు ఆత్మీయ తెలంగాణ విందు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి.
📅 తేదీ: 03 జూన్ 2026, బుధవారం
🕡 సమయం: సాయంత్రం 6:30 గంటల నుండి
📍 వేదిక: ICC అశోక హాల్, దోహా, ఖతర్
మీ రాకతో ఈ వేడుకలకు మరింత శోభ చేకూరుతుంది.
ఇట్లు,
తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్
M.సంధ్యారాణి
ప్రధానకార్యదర్శి.
29/05/2026
*తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్, ఇండియన్ కల్చరల్ సెంటర్ – ఖతర్ సహకారంతో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*
తెలంగాణ మట్టి పరిమళం…
తెలంగాణ పాటల సందడి…
తెలంగాణ సంస్కృతి వైభవం…
మన ఊరి ఆత్మీయతను గుర్తు చేసే మహోత్సవ వేళ ఆసన్నమైంది. ✨
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని
తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ ఆధ్వర్యంలో
అందరం ఒక కుటుంబంలా కలిసి
ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుందాం. 💐
📅 జూన్ 03, 2026 బుధవారం
🕡 సాయంత్రం 6:30 గంటల నుండి
📍 ICC అశోక హాల్, ఖతర్
🎶 సాంస్కృతిక కార్యక్రమాలు
🤝 ఆత్మీయ కలయికలు
🍽️ రుచికరమైన తెలంగాణ విందు భోజనం
🎊 వినోదభరిత కార్యక్రమాలతో ప్రత్యేక ఆకర్షణ
విదేశాల్లో ఉన్నా…
మన తెలంగాణపై ప్రేమ, మన సంప్రదాయాలపై గౌరవం ఎప్పటికీ తగ్గదని చాటిచెప్పే వేడుక ఇది. ❤️
తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్
ఎల్లప్పుడూ తెలుగు కార్మికుల సంక్షేమం కోసం సేవలందిస్తూ ముందంజలో నిలుస్తోంది. 🙏
మీరు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు తప్పక విచ్చేసి
ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. 🙏
29/05/2026
*తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్, ఇండియన్ కల్చరల్ సెంటర్ – ఖతర్ సహకారంతో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*
తెలంగాణ మట్టి పరిమళం…
తెలంగాణ పాటల సందడి…
తెలంగాణ సంస్కృతి వైభవం…
మన ఊరి ఆత్మీయతను గుర్తు చేసే మహోత్సవ వేళ ఆసన్నమైంది. ✨
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని
తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ ఆధ్వర్యంలో
అందరం ఒక కుటుంబంలా కలిసి
ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుందాం. 💐
📅 జూన్ 03, 2026 బుధవారం
🕡 సాయంత్రం 6:30 గంటల నుండి
📍 ICC అశోక హాల్, ఖతర్
🎶 సాంస్కృతిక కార్యక్రమాలు
🤝 ఆత్మీయ కలయికలు
🍽️ రుచికరమైన తెలంగాణ విందు భోజనం
🎊 వినోదభరిత కార్యక్రమాలతో ప్రత్యేక ఆకర్షణ
విదేశాల్లో ఉన్నా…
మన తెలంగాణపై ప్రేమ, మన సంప్రదాయాలపై గౌరవం ఎప్పటికీ తగ్గదని చాటిచెప్పే వేడుక ఇది. ❤️
తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్
ఎల్లప్పుడూ తెలుగు కార్మికుల సంక్షేమం కోసం సేవలందిస్తూ ముందంజలో నిలుస్తోంది. 🙏
మీరు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు తప్పక విచ్చేసి
ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. 🙏
Indian Cultural Centre in association with Telangana Gulf Samithi Qatar presents Telangana Formation Day Celebrations - Wednesday Fiesta on Wednesday, 3rd June 2026 at ICC Ashoka Hall from 6.30pm onwards. All are cordially invited to join the fiesta.
26/05/2026
🌙✨ ఈద్ ముబారక్ ✨🌙
తెలంగాణ గల్ఫ్ సమితి – కతర్ తరపున
ఖతార్‌లో నివసిస్తున్న సమస్త తెలుగు ప్రజలకు
ఈ పవిత్ర ఈద్-ఉల్-ఫితర్ పండుగ సందర్భంగా
హృదయపూర్వక ఈద్ శుభాకాంక్షలు.
ఈ పండుగ మీ జీవితాల్లో
సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని
మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
“ఐక్యతే మన బలం… సేవే మన ధర్మం…”
“తెలుగు ప్రజల అభ్యున్నతే మా లక్ష్యం”
— తెలంగాణ గల్ఫ్ సమితి – కతర్
🌙 Eid Mubarak 🌙
On the auspicious occasion of Eid-ul-Fitr,
Telangana Gulf Samithi – Qatar
extends heartfelt wishes to all Telugu people living in Qatar.
May this blessed festival bring peace, happiness, prosperity, and good health to you and your family.
“Unity is our strength… Service is our duty…”
“The welfare of Telugu people is our mission.”
— Telangana Gulf Samithi – Qatar
05/05/2026
తెలంగాణ - గల్ఫ్ 'వలస మార్గం' లో ముందడుగు
◉ స్వదేశం, విదేశాల్లోని సంఘాలు కలిసి పనిచేస్తే వలస కార్మికుల సమస్యలకు త్వరిత పరిష్కారం సాధ్యమవుతుంది.
◉ ఇండియా - ఖతార్ 'లేబర్ మైగ్రేషన్ కారిడార్' లో ఇరు దేశాల్లోని సంఘాల సమన్వయం
బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యూఐ) అనే ప్రపంచం కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో... గ్లోబల్ ఆర్గనైజింగ్ అకాడమీ, ఆసియా పసిఫిక్ అనే సంస్థ ఈనెల 4-5 తేదీల్లో ఫిలిప్పీన్స్ లోని మనీలాలో కార్మిక సంఘాల ప్రతినిధులకు రెండు రోజుల శిక్షణ సమావేశం నిర్వహించింది. 10 దేశాలలోని 22 అనుబంధ సంస్థల నుంచి 42 మంది పాల్గొన్నారు.
ఇండియా - ఖతార్ 'మైగ్రేషన్ కారిడార్' (వలస మార్గం) లో ఇరు దేశాల్లోని సంఘాల సమన్వయం అనే అంశంపై జరిగిన చర్చలో... తెలంగాణ నుండి ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మంద భీంరెడ్డి, ఖతార్ లోని తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షులు మైదం మధు పాల్గొన్నారు. స్వదేశంలో, విదేశంలో పనిచేసే రెండు వేర్వేరు సంఘాలు సమన్వయంతో పనిచేస్తే... వలస కార్మికుల సమస్యలను వేగంగా, సులువుగా ఎలా పరిష్కరించవచ్చునో ఇరువురు నేతలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇద్దరు ప్రవాసీ కార్మిక నాయకులు జగిత్యాల జిల్లావాసులు కావడం విశేషం.
ఖతార్ దేశానికి ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన నిర్మాణరంగ వలస కార్మికులకు మార్గదర్శనం, శిక్షణ ఇవ్వడానికి 'గ్లోబల్ ఆర్గనైజింగ్ అకాడమీ' కృషి చేస్తున్నది. గమ్యస్థాన దేశాల్లోని వలస కార్మిక సమూహాలు, మూలస్థాన దేశాల్లోని బిడబ్ల్యూఐ
అనుబంధ సంస్థల మధ్య సహకారం ఏర్పరచేందుకు ఒక వలస కార్మిక కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
Bheem Reddy Mandha
Guggilla Ravi Goud
Shankar Goud
Naresh Singireddy
Chennamaneni Srinivasrao
Vinod V Nair
(ప్రెస్ నోట్: 05.05.2026)
03/05/2026
తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు శ్రీ మైధం మధు గారు, ఫిలిప్పీన్స్‌లోని మనిలా నగరంలో జరుగుతున్న “3rd BWI Asia-Pacific Global Organising Academy (GOA) Training” కార్యక్రమంలో పాల్గొనడం మన అందరి కార్మికులకు గర్వకారణం,మరియు ఎంతో ఉపయోగకరమైన విషయం.
ఈ ట్రైనింగ్ ద్వారా కార్మిక హక్కులు, సంక్షేమం, సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై విలువైన జ్ఞానం మరియు అనుభవం అందుకుంటారు. ఈ నేర్చుకున్న విషయాలను కతార్‌లో పనిచేస్తున్న మన తెలుగు కార్మికుల సమస్యల పరిష్కారం, అవగాహన పెంపు, మరియు వారి అభివృద్ధి కోసం ఉపయోగించనున్నారు.
మన కార్మికుల భవిష్యత్తు కోసం ఇలాంటి అంతర్జాతీయ స్థాయి ట్రైనింగ్స్ చాలా ఉపయోగపడతాయి.
తెలంగాణ గల్ఫ్ సమితి తరపున మధు గారికి హృదయపూర్వక అభినందనలు 💐
30/04/2026
🙏 ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు🙏
వేల కిలోమీటర్ల దూరంలో కుటుంబాన్ని వదిలి ఎండలో కష్టాల్లో జీవిస్తూ మన ఇళ్లలో వెలుగులు నింపుతున్న గల్ఫ్ కార్మికులందరికీ నా వందనాలు 🙏.
మీరు పడే ప్రతి చెమట చుక్క మీ కుటుంబానికి ఆశగా మారుతోంది మీ కష్టం వల్లే పిల్లల భవిష్యత్తు వెలుగులోకి వస్తోంది ఎవరికీ కనిపించని బాధలు ఒంటరితనం కష్టాలు అన్నీ భరించి ముందుకు సాగుతున్న మీ ధైర్యమే నిజమైన గొప్పతనం.
💪 👉 మీ శ్రమకు గౌరవం కావాలి
👉 మీ హక్కులకు రక్షణ కావాలి
👉 మీ జీవితాలకు భద్రత కావాలి
“ప్రవాసంలో కష్టపడే ప్రతి కార్మికుడు తన కుటుంబానికి నిజమైన హీరో...
తెలంగాణ గల్ఫ్ సమితి తరపున ప్రతి గల్ఫ్ కార్మిక సోదర సోదరీమణులకు హృదయపూర్వక మే డే శుభాకాంక్షలు 💐