Dallas Jana Sainyam

Dallas Jana Sainyam

Share

Welcome to Dallas Janasena.

04/09/2026

స్వార్థాలే తోడేళై సింహాసనాలపై కూర్చున్న కాలంలో —
నిస్వార్థం నిలువెత్తు రూపుగా నిలిచిన నా నాయకుడు!
అధికార దాహం లేని అడుగు,
డబ్బు మీద ఆశ లేని చూపు,
ప్రజలపై ప్రేమే శ్వాసగా మిగిలిన హృదయం —
అదే ఆయన నమ్మిన సత్యం!
తీసుకోవడమే జీవితం అన్న సమాజంలో
ఇవ్వడమే జీవితం అని నేర్పే మనిషి —
భూమికి, ప్రకృతికి, మనుషులకు
తిరిగి ఇవ్వాలనే తపనతో నడిచే యోధుడు!
పసిపిల్లవాడి పారదర్శక మనసు,
అంతరాలు లేని అంతరంగం,
ఆడంబరాల ఆవరణలు లేకుండా
నిజాన్ని మోసే నడక —
ఆ నడకే మార్గం!
ఆ మార్గమే మార్పు!
రేపటి విధాతగా నిలబడి,
తరాల భవిష్యత్తుకు తలరాతగా మారి,
జనం మెచ్చిన నాయకుడై,
జనాన్ని కాపాడే జ్వాలగా వెలిగే —
జనసేనాని!
నా పవన్ కళ్యాణ్!

- సురేష్ కరోతు (తాజ్)

04/09/2026

పుష్కర పురుషోత్తముడు

ఇది ఒక ప్రయాణం కాదు —
ఇది ఒక ప్రతిజ్ఞ.
ఇది ఒక నాయకుడి కథ కాదు —
ఇది ఒక నడిచే ఆలోచన.
మాటలు చాలన్నప్పుడు
మౌనం మిగిలింది.
మౌనం చాలన్నప్పుడు
పోరాటం మొదలైంది.
చేతులు జోడించలేదు —
ముష్టులు బిగించాయి.
వేదికలు కాదు —
వీధులే వేదికయ్యాయి.
ఎవరి కోసం అన్న ప్రశ్నకు
ఒకే సమాధానం —
మనుషుల కోసం.
వోటు వేసినవాడా?
వేయనివాడా?
అడిగినవాడా?
అడగనివాడా?
అన్న తేడా లేకుండా
అడవిలోనూ అడుగు పెట్టిన ఆరడుగులబుల్లెట్ —
అదే నిజమైన నాయకత్వం.
అడవితల్లి గుండెలో
కొత్త దారులు పుట్టాయి.
మట్టిలో మునిగిన ఊర్లు
మళ్లీ వెలుగుని చూశాయి.
నీరు వచ్చింది —
పలుకులు మారాయి.
వెలుగు వచ్చింది —
జీవితాలు నిటారుగా నిలిచాయి.
ఇది పాలన కాదు —
ఇది మనిషిని మళ్లీ మనిషిగా గుర్తించిన క్షణం.
లాభనష్టాల గణితం
పక్కన పడేసి
మనసు గణితం మొదలుపెట్టినపుడు —
అదే విప్లవం.
ఆశయం
అవకాశం అయ్యింది.
అవకాశం
ఆచరణ అయ్యింది.
ఆచరణ
ఆదర్శం అవుతోంది.
పవన్ కళ్యాణ్ —
ఒక పేరు కాదు,
ఒక పిలుపు.
జనసేన —
ఒక జెండా కాదు,
ఒక జ్వాల.
ఇది ముగింపు కాదు…
ఇది మొదలైన అగ్ని ఇంకా ప్రకాశించవల్సిందే.

సశేషం…

ఇట్లు
సురేష్ కరోతు
టీం అట్లాంట జనసేన

09/27/2024

*వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మండే నాస్తి కించన; వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ॥*🙏🙏🪔🪔

*Join with Shri Pawan Kalyan garu in his quest for Justice* 🕉️🕉️ @ Frisco, Texas. Tomorrow

We cordially invite all Hindu Devotees to Participate in an Hour long prayer and meditation. @ *Tomorrow.*

1. Immediate investigation into the adulteration of Tirumala Laddu Prasadam.
2. Setup a Sanathana Pariraksha Board to Protect Hindu Dharma.

*Date:* Saturday, September 28th 2024, Tomorrow
*Time:* 8:00 am - 9:30 am
*Address:* 8843 Coleman Blvd, Frisco, TX - 75034

*Note:* It is advised to bring Yoga mats, Meditation Cushions or comforters 🧘🏻🧘🏻🕉️🕉️

Post Prayer refreshments will be provided. 🧃☕️🍵

Veṅkaṭādri samaṁ sthānaṁ brahmaṇḍē nāsti kin̄cana; vēṅkaṭēśa samō dēvō na bhūtō na bhaviṣyati॥ 🙏🙏

08/26/2024

స్పేస్ పార్క్ పై సానుకూలంగా స్పందించిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

విద్యార్థి స్థాయి నుంచే అంతరిక్ష శాస్త్రంపై అవగాహన ప్రాధాన్యతను పెంపొందించుకోవాల్సిందిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం రష్యా వ్యోమగామి సెర్గీ కోర్సకోవ్ మరియు స్పేస్ కిడ్జ్ ఇండియా ప్రతినిధులతో సమావేశమయ్యారు మరియు అంతరిక్ష సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్ పార్క్ ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించారు. విద్యార్థి స్థాయి నుంచే అంతరిక్ష శాస్త్రంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన ప్రాధాన్యతను ఆయన ఎత్తిచూపారు మరియు విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తమ బృందం చేపట్టిన పరిశోధనలు, అభివృద్ధి చేసిన ఉపగ్రహాలపై చర్చించారు. సందర్శకులు ఇటీవల అభివృద్ధి చేసిన సూక్ష్మ ఉపగ్రహ డిప్లాయర్ పనితీరును కూడా ప్రదర్శించారు.
స్పేస్ కిడ్జ్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు సి.ఎ.ఒ అయిన డాక్టర్ కేషన్, విద్యార్థులలో అంతరిక్ష శాస్త్రం పట్ల ఆసక్తిని రేకెత్తించడానికి రాష్ట్రంలో ఒక స్పేస్ పార్క్ ఏర్పాటును ప్రతిపాదించారు. అటువంటి పార్కులు ప్రస్తుతం నాసాలో మాత్రమే ఉన్నాయని, భారతదేశంలో లేవని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్ పార్కును రూపొందించడం వల్ల అంతరిక్ష రంగంలో విద్యార్థుల అవగాహన మరియు ప్రమేయాన్ని గణనీయంగా పెంచవచ్చని డాక్టర్ కేషన్ సూచించారు. ఈ సూచనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గీ కోర్సకోవ్‌కు చంద్రయాన్-3 రాకెట్ నమూనాను అందించి పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఆరు నెలలపాటు అంతరిక్షంలో గడిపిన సెర్గీ, తన మిషన్‌లో నిర్వహించిన పరిశోధనలు మరియు అంతరిక్షంలో ఇంత ఎక్కువ కాలం గడిపేందుకు అనుసరించిన వ్యూహాల గురించి ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
అంతరిక్ష సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని ఉపముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.
స్పేస్ కిడ్జ్ సంస్థ గురించి క్లుప్తంగా:
స్పేస్ కిడ్జ్ ఇండియా అనేది ఒక భారతీయ ఏరోస్పేస్ స్టార్టప్, ఇది చిన్న ఉపగ్రహాలు, స్పేస్‌క్రాఫ్ట్ మరియు గ్రౌండ్ సిస్టమ్‌ల రూపకల్పన, కల్పన మరియు ప్రయోగానికి మార్గదర్శకంగా ఉంది. విద్య, పరిశోధన మరియు పరిశ్రమల అవసరాలను తీర్చడానికి అంతరిక్షానికి ఆర్థిక మరియు స్థిరమైన ప్రాధానాన్ని అందించడం ఈ సంస్థ యొక్క లక్ష్యం. భారతదేశంలో హైస్కూల్ మరియు కళాశాల విద్యార్థుల ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించిన ప్రపంచంలోనే మొట్ట మొదటి సంస్థ. "నాస", "ఎ.ఎస్.ఎ" మరియు "రష్యా" అంతరిక్ష శిబిరాలకు కూడా రాయబారులుగా వ్యవహరిస్తారు. వీరు ఇంత వరకు 19 బెలూన్ ఉపగ్రహాలు, 3 ఉప కక్ష్య ఉపగ్రహాలు మరియు 4 కక్ష్య ఉపగ్రహాలను ప్రయోగించారు.
అసలు శాస్త్రవేత్తలను తయారుచేయడంలో మన భారతదేశం ఏ క్రమంలో ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం.
ప్రతీ వెయ్యమంది శాస్త్రవేత్తలలో సుమారు 600మంది ఒక్క అమెరికా నుండే తయారు అవుతున్నారు. ఆ తరువాత బ్రిటన్, చైనా, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. అందులో మన స్థానం 97. అలాగే శాస్త్రవేత్తలను తయారుచేసే యూనివర్సిటీస్ ఎక్కువ అమెరికాలోనే ఉన్నాయి. ఒకటి అరా బ్రిటన్లో ఉన్నాయి.
ఇంతవరకు మనదేశానికి ఒక్క స్పేస్ పార్క్ కూడా లేదు.
ఇట్లు,
సురేష్ కరోతు
టీం అట్లాంట జనసేన

08/23/2024

గ్రామ సభ: ఊరు బాగు కోసం ప్రతి ఒక్కరు పాల్గొనండి.
మన పంచాయితీ! మన సాధికారత!!
ఒక ఆలోచన, మంచి చెయ్యలనే తపన, తనదైన ముద్ర, ప్రజల క్షేమం కోసం పరితపించే నాయకులు, నాకు ప్రజలే దేముడ్లు అని, ప్రజలకు నేను ఒక కూలిని అని సగర్వంగా చెప్పుకొన్న నాయకుడు మన ఉపముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పంచాయతీలు - 13,326
గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ - 49 రకాల పనులు.
వ్యవసాయ అనుబంద పనులు - 38 రకాల పనులు.
ఎన్.డి.ఎ పభుత్వం మంజూరు చేసిన నిధులు - రూ.4500 కోట్లు
9 కోట్ల పనిదినాలు.
54 లక్షల కుటుంబాలకు ఉపాది.

ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వేసిన అడుగు దేశవ్యాప్తంగా ఒక రికార్డ్. ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి 13,326 పంచాయితీలలో గ్రామసభలను నిర్వహించడం. అందులో ఆయన స్వయంగా మైసూరా వారి పల్లె గ్రామ సభలో పాల్గొనడం, తీర్మానలు చెయ్యడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి.

మైసూరా వారి పల్లె ఎంచుకోవడంలో ప్రత్యేకత: 2021లో నాటి అవినీతి పాలనకు ఎదురొడ్డి పోరాడిన జనసేన వీర మహిళ శ్రీమతి సంయుక్త గారు జనసేన పార్టీ తరుపున ఎన్నికైన సర్పంచ్. నాడు చెల్లికి ఇచ్చిన మాటకోసం నేడు పయనమైన పవన్ కళ్యాణ్ గారు (మైసూరా వారి పల్లె, రాయలసీమలో రైల్వే కోడురు నియోజకవర్గ పరిదిలో ఉన్నది).

మైసూరావారి పల్లి గ్రామసభలో గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో ముఖ్యాంశాలు:

1) ప్రతీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ చదివితే, ఆమె ఇంటికి, పల్లెకు, పట్టణానికి, రాష్ఠాని మొత్తం దేశానికే వన్నె తెస్తుంది అని చెప్తూ అందుకు ఉదాహరణగా మన రాష్ఠపతి శ్రీమతి ద్రౌపధి ముర్ముర్ గారు గురించి చక్కగా చెప్పారు. ఒక సర్పంచ్ నుండి రాష్ఠపతి వరకు ఆమె ప్రయాణమే నేటి మహిళలకు స్పూర్తి.
2) పౌర హక్కుల సమాచార చట్టం ప్రకారం ప్రతీ పని తాలుక పని వివరాలు బోర్డ్ పెట్టలని, ఆ పని ఆయ్యే వరకు మీరంతా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. దీనిలో కాంట్రక్టర్ తాలూకా వివరాలు, అమోదించబడిన బడ్జెట్ వివరాలు పొందుపరచాలని అధికారులను కోరారు. ఎన్ని లేయర్ల రోడ్ వేసారో లాంటి వివరాలు పెట్టలని అది ప్రజలు కూడా పరిక్షించాలని అప్పుడే మన పంచాయితీ నిధులు సద్వినియోగ పడతాయి అని అన్నారు.
2) శక్తిని కొంతమందికే దార పోస్తారా? లేదా మీ గ్రామాలకు మీరే బాద్యత తీసుకొంటారా?? అని సూటిగా ప్రశ్నించడమే కాదు. పనులు జరగకపోతే నిలదియ్యమన్నారు.
3) డబ్బులు లేకుండా గ్రామ సభలు పెట్టడం ఏంటని నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు సుమారు 70% వైసిపి వాళ్ళు సర్పంచులుగా ఉన్నారు. వారిని అడగండి, పంచాయితీలో డబ్బులు పడ్డాయో లేదో అని.

4) యువతని ఉద్ద్దేశించి సినిమా ఒక్క ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన, దేశం మీద ప్రేమ ఉండాలి. మన ఇంట్లో అమ్మకి, అక్కకి, చెల్లికి, వదినకి మనం అండగా నిలబడాలి. యువత బైటికి రావాలి. పల్లెలే పట్టణానికి పట్టుకొమ్మలు. ముందస్తూగా పంచాయితీ నుండే మీరు నాయకత్వ పఠిమను పెంచుకొండి. భవిష్యత్తులో మీరే ఈ రాష్ఠానికి నాయకులు అవుతారు.
5) అన్న హజారే అంటే నాకు చాలా ఇష్ఠం. అన్నయ్య చిరంజీవి గారు నటించిన రుద్రవీణకి ఆయనే స్పూర్తి. రేలేగావ్ సిద్ది గ్రామానికి ఆయన చేసిన సేవలు, దీని ద్వారా మొత్తం దేశాన్నే కదిలించగలిగారు అని గొప్పగా కొనియాడారు.

మైసూరా వారి పల్లెకు ఇచ్చిన హామీలు:
1. హెల్త్ క్లీనిక్ ఏర్పాటు చేస్తాం.
2. మండల పరిషత్ స్కూల్ పిల్లలకు స్కూల్ గ్రౌండ్స్.
3. అరటి పండు వ్యవసాయాన్ని రభి నుండి ఖరీఫ్ కి మార్చే బాద్యతతో పాటు ఇన్సూరెన్స్ అమలు అయ్యేటట్టు చూడడం.
4. రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూసమస్యలను తీర్చడం. అవసరమైతే సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ కోర్ట్లు కూడా ఏర్పాటు చేసి సమస్యలు తీరుస్తాం.
5. బైరటీస్ గనులు పై స్పందిస్తూ, ఇక్కడి యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాది హామి కల్పించాలని కోరుకొన్నారు.
6. ఏబైశాతం మహిళలు ఉన్న ఈదేశంలో మహిళలు నిరభ్యంతరంగా తన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే విధంగా గ్రామ పంచాయితీలను తీర్చిదిద్దుతాం అని హామి ఇచ్చారు.

యువ శక్తి: నవ్వుపోయిన నవ్వ్యాంద్రాకి యువత కధం తొక్కి ఈరోజు నేటి సమాజానికి మీరు ధైర్యం ఇచ్చారు. పదివేల మంది మాలాంటి నాయకులు వచ్చిన, ఒక్కసారి మీరు రోడ్ ఎక్కితే ఈదేశం దశ దిశ నిర్దేశిస్తారు.

సైబర్నెట్ కనెక్టివిటి: గ్రామాలలో బ్రాడ్ బేండ్ కల్పించడం ద్వారా ఇక్కడి విద్యార్ధికి, నైపుణ్యం కలిగిన వారికి భాష అడ్డంకి కాకూడని మన భాషలో కూడా సాఫ్ట్వేర్ ప్రధాన మంత్రిగారి పధకం ద్వారా అందుకోవాలి.
మనం డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వెయ్యాలని చెప్పారు.

స్వర్ణపంచాయితి: భవిష్యత్తులో ప్రతీ పంచాయితి ఒక సెల్ఫ్ గవర్నమెట్ యూనిట్ గా కావాలి. స్వయం పరిపాలన చేసుకొనే శక్తి ప్రతీ గ్రామానికి ఉండాలి.
నారీ మేదస్సు: శ్రిమతి పగడాల లక్ష్మి గారు మాటలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ప్రేరణ కల్పించాయి. శ్రీమతి లక్ష్మి గారు మా గ్రామంలో చాలామంది ఉపాది కోసం పక్క రాష్ఠాలకు వెళ్ళిపోతున్నారు. అదే ఇక్కడ మాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది కదా అని అన్నారు. నా ఆడబిడ్డ అడిగింది అంటే, దీన్ని ప్రత్యకంగా తీసుకొని ఆ దిశగా పనిచేస్తాము అని మాట ఇచ్చారు. మహిళలు మీరు అనుకోబట్టే 164 అసెంబ్లీ స్థానాలను ఈరోజు కూటమి గెల్చుకోగలిగింది. మీరు బలం ఇవ్వబట్టే మేము సుమారు 940కోట్లు నిన్న ఎకౌంట్స్ లో వెయ్యగలిగాము. అది మీరు ఇచ్చిన బలం. మహిళలందరికి నా హృదయపూర్వక నమస్కారాలు.

ఏదైనా కావాలంటే అడగాలి: శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మనకి ఏదైనా కావలంటే అడగాలి అని చెప్తూ ఉదాహరణగా అపిల్ వ్యవస్తాపకులు స్టీవ్ జాబ్స్ ఆయన చిన్నప్పుడు ఏదో నేర్చుకొన్నప్పుడు ఒక సర్క్యూట్ బోర్డ్ కావలసి వచ్చింది. వెంటనే ఆయన ఐ.బి.ఎం ఓనర్ కి కాల్ చేసి అడిగారు. వెంటనే ఆయన స్టీవ్ జాబ్స్ కావల్సిన సర్క్యూట్స్ పంపించారు అంట. ఎంతమంది ముందుకు వస్తారో తెలియదు గాని, ముందు మనం కావాలంటే అడగడానికి మొహమాటపడవద్దు.

మచ్చుతునక: పంచాయితి సొమ్ము 8 సెంట్లు అని తెలుసుకొని, నాకున్న దాంట్లో 10 సెంట్లు ఇస్తాను అని ముందికి వచ్చిన శ్రీ కారుమంచి నారాయణ గారిని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకొని చెప్పిన మాటలు మనందరిని ఆలోచింప చేసాయి. మీరు ఇచ్చిన భూమిని సద్వినియోగం చేసుకొంటాం. అదే ప్రారంభోస్తవం రోజు నేను వస్తాను, అలాగే రాష్టం అంతా మీకు గుర్తింపు వచ్చేలా చేసే బాద్యత నాది అని చెప్పారు.
ఇప్పటిదాక అందరూ నన్ను ఫొటో అడిగారు, నాకు కారుమంచి నారాయణ గారుతో ఒక ఫొటో కావాలని అడిగి మరీ ఫొటో తీయించుకొన్నారు.

గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి: భారతదేశానికి శాంతి, స్వపరిపాలనతో కూడిన అభివృద్ధి అవసరం అని గాంధీజీ అన్నారు. గ్రామాన్నే ఒక రిపబ్లిక్ గా చెయ్యాలన్నారు. శాసనసభ, పార్లమెంట్ లాగ గ్రామసభ కూడా ప్రజావసరాలను తీర్చే వ్యవస్థ. గ్రామాలు పచ్చగా ఉంటే, దేశం పచ్చగా ఉంటుందన్నారు.గ్రామ పరిపాలన మానవీయత అవసరాలకు అనుగుణంగా నడిపించగలిగిన నాడు, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడిచే అవకాశం ఉందన్నారు. గ్రామాలు స్వయంపోషకాలుగా అభివృద్ధి చెందడమే కాకుండా, యువత గ్రామీణాభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషించడంతో గ్రామస్వరాజ్యాలుగా అవతరించాలి.

మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పధకం - ఆంధ్రప్రదేశ్:
ముఖ్య ఉద్ధేశం: భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.

రాజీలేని అంశాలు:
గ్రామ పంచాయితీలో నమోదు చేసుకొన్న ప్రతి కుటుంబానికి ఒక ఆర్ధిక సం.లో 100 ఒరజుల వేత ఉపాధి.
ఆర్.ఒ.ఎఫ్.ఆర్ లభిదారులకు 150 రోజుల వేతన ఉపాది.
పనిచేసిన 15 రోజుల్లో వేతనాలు చెల్లింపు.
స్త్రీ, పురుషులకు సమాన వేతనం.
గ్రామ సభ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులో ఆమోదించిన పనులను మాత్రమే చేపట్టాలి.




ఇట్లు,
సురేష్ కరోతు
టీం అట్లాంట జనసేన

08/23/2024
06/06/2024

❤️🙏

06/06/2024
05/12/2024

జనసేన పార్టీ కి 12 లక్షల సహకారం అందించిన డల్లాస్ జనసైనికులు

Want your business to be the top-listed Government Service in Dallas?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Dallas, TX