12/11/2026
మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మరో ఐదుగురికి జైలు శిక్ష
మేడ్చల్, నవంబర్ 12:
మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనాలు నడపడం), డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి నమోదు చేసిన మొత్తం 08 కేసులను ఈ రోజు అనగా 12-11-2026న మేడ్చల్లోని గౌరవనీయ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వారి న్యాయస్థానంలో హాజరు పరచగా విచారించి పరిష్కరించడం జరిగింది.
కేసుల వివరాలు:
- డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం (WDL): 02 కేసులు పరిష్కరించగా, సంబంధిత వ్యక్తులకు మొత్తం ₹2,000/- జరిమానా విధించడం జరిగింది.
- డ్రంక్ అండ్ డ్రైవ్ (DD): 06 కేసులు పరిష్కరించగా, మొత్తం ₹4,500/- జరిమానా విధించడంతో పాటు, ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
జైలు శిక్ష వివరాలు:
- ఒకరికి 10 రోజుల జైలు శిక్ష.
- నలుగురికి 04 రోజుల చొప్పున జైలు శిక్ష.
ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని హెచ్చరించారు.
SHO
మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్