01/11/2026
*ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశం వివరాలు*
• *వివేకహత్య, గులకరాయి డ్రామాలు మాదిరే మరో డ్రామాలకు వైసీపీ తెరలేపింది*
• *జమ్మలమడుగులో ఉన్న నేను పులివెందులలో గుండాయిజం చేయడం ఏంటి?*
• *ఈ ఎన్నికల తర్వాత డైనోసార్ లా వైసీపీ కనుమరుగు అవ్వడం ఖాయం*
• *జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధికి ప్రజలు సిద్ధమయ్యారు*
వైఎస్సార్‌సీపీ కుట్రలు, డ్రామాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల్లో జగన్ టైమ్ అయిపోయిందని అందుకే దాడుల పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. జమ్మలమడుగుకు పది కిలోమీటర్ల దూరంలో దేవగుడిలో ఉన్న ఆయన పులివెందుల్లో గూండాయిజం చేయడం ఏంటిని ప్రశ్నించారు. జగన్ అనుకూల మీడియాలో తన పేరును పదేపదే ప్రస్తావించడం, పులివెందుల్లో నేనే గుండాయిజం చేస్తున్నట్లు చూపించడం సరైనా పద్దది కాదని హెచ్చరించారు. గతంలో గతంలో వివేకనందా రెడ్డిని హత్య చేసి ఆ నేరం మాపై నెట్టే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు అలాంటి డ్రామాలకే మరోసారి తెరలేపారని తనపై వచ్చిన విమర్శనలను తిప్పికొట్టారు.
“హెలిక్యాప్టర్ అత్యవసర ల్యాండ్ అంటూ మరో డ్రామా చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటర్లను ప్రభావితం చేసేలా ఇలా ప్రవర్తిచడం ఎంత వరకు సరైనా పద్దతి. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఇచ్చిన సూచనలే ఇవాళ వాళ్లు పాటిస్తున్నారు. కాలర్స్ మడత పెట్టి విధ్వంసాలు సృష్టి స్తున్నారు. వివేకానందరెడ్డిని వాళ్లే హత్య చేసి గుండెపోటుగా చిత్రికరించారు. ఆ తర్వాత ఆ నేరం చంద్రబాబు గారు, నాపై నెట్టే ప్రయత్నం చేశారు. అవినాష్ రెడ్డి బెయిల్ కోసం మరో డ్రామా ఆడారు. తల్లికి గుండెపోటు వచ్చినట్లు చూపించి కర్నూల్ లో సీబీఐకి దొరక కుండా అడ్డంపడ్డారు. గులకరాయి మరొక డ్రామా. తండ్రి అధికారంలో అడ్డదారిలో లక్షల కోట్లు సంపాధించి సూట్‌కేసులు కంపెనీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు. ఈ రోజు 11 సిబిఐ, 9 ఈడీ కేసులు ఉన్న జగన్ నీతి నిజాయితీగా మాట్లాడటం మరో డ్రామా. జగన్‌రెడ్డితో పాటు ఆయన అభ్యర్థి రాజమౌళి ప్రసాద్ రెడ్డి లాంటి వారు దాడులు చేయించి ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు.”
“ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కలిసి చంద్రబాబు గారు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 28 నెలల్లోనే ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చి ప్రతీ హామీని నెరవేర్చాం. ఈ అభివృద్ధి, పులివెందుల్లో వైసీపీ ఓటమి చూసి ఓర్వలేకే వైసీపీ పార్టీ ఈ డ్రామాలకు తెరలేపింది. 2021 ఎన్నికల్లో వైసీపీ చేసిన విధ్వంసం, బలవంతపు ఏకగ్రీవాలు దేశం మొత్తం చూసింది. ఇప్పుడు వాళ్లే కార్లకు నిప్పులు పెట్టి సానుభూతి కోసం మరో డ్రామాలు సృష్టిస్తున్నారు. వైసీపీ పార్టీ డైనోసార్ మాదిరి కనుమరుగు అవ్వడం ఖాయం. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.” అని త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు.