Telugu Desam Party: Pathapatnam

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Pathapatnam Official Page of TDP Pathapatnam

07/11/2026

రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20 వేలు ఇస్తున్నాం. అలాగే ఇన్ ఫుట్ సబ్సిడీ కూడా ఇస్తున్నాం. అయితే ఏ కారణం చేత అయినా పంట నష్టపోయే పరిస్థితి వస్తే ఈ సాయం సరిపోదు. అందుకే రైతులు పంట బీమా చేసుకుంటే... ఇటు బీమా డబ్బులు అటు కొద్దో గొప్పో చేతికొచ్చిన పంట కలిసి రైతుకు రక్షణ ఇస్తాయి.
- రైతులతో చంద్రబాబుగారు



07/11/2026

రాప్తాడులో ఉన్మాది హేమంత్ చేసిన రంపపు దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక తల్లి ఈమె. తమకు ఇక దక్కదేమో అనుకున్న తమ కూతురు మంత్రి నారా లోకేష్ గారి చొరవతో తిరిగి ప్రాణం పోసుకుందని ఆమె అంటున్నారు.

07/11/2026

2024లో ప్రజలు ఎన్డీయేకి అపూర్వ విజయాన్ని అందిస్తే ఆనాడు జగన్ రెడ్డి ఈవీఎంలను తప్పు పట్టాడు. మరి ఈరోజు బ్యాలెట్ ఓటింగ్ లో కూడా ఇంకా మెరుగైన తీర్పు వచ్చింది. దీని మీద కూడా జగన్ ఇంకేదో మాట్లాడుతున్నాడు. ప్రజల తీర్పు మారలేదంటే నీ తీరు మారలేదని అర్థం. జగన్ ఇకనైనా మారు.





07/11/2026

రాప్తాడు జెడ్పీ స్కూల్‌లో దాడికి గురై బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపికను ఈరోజు పరామర్శించాను. గోపిక కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. గోపిక స్వయంగా మాట్లాడింది. మంత్రి లోకేష్ గారే తన ప్రాణాలు కాపాడారని కృతజ్ఞతలు తెలిపింది. తాను త్వరగా కోలుకుని పదవ తరగతి పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుని లోకేష్ గారికి బహుమతిగా ఇస్తానని చెప్పింది.

07/11/2026

గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసుకుని పర్యటనలు, పరామర్శలకే పరిమితమయ్యారు. కానీ మా ప్రభుత్వం ఎన్నికల కంటే ప్రజా సమస్యలకే ప్రాధాన్యతనిస్తూ, తుఫాన్ల సమయంలో ప్రజలకు అండగా నిలిచి సహాయక చర్యలు చేపట్టాం.




07/11/2026

రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా చంద్రబాబు గారికి అన్నదాత కష్టం గురించి తెలుసు. అందుకే తుఫాను మూలంగా రైతుకు జరిగిన నష్టాన్ని, అన్నదాత ఆవేదనని స్వయంగా క్షేత్ర స్థాయిలో చూసి తెలుసుకున్నారు. అందుకోసం ప్రత్తిపాడు నియోజకవర్గం రేటూరులో పొలం గట్ల వెంబడి, పంట కాలువల వెంబడి తిరిగారు. రైతులతో మాట్లాడారు. వారికి భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు.



07/11/2026

కాలికి మట్టి అంటుకోకుండా కార్పెట్. చెమట చిందించే రైతు వాసన దగ్గరకు రాకుండా బారికేడ్లు. భూమి పుత్రుడిని అవమానిస్తూ ఆనాడు జగన్ చేసిన పెత్తందారీ పర్యటనకి... చేజారిన పంటని చేతుల్లోకి తీసుకుని రైతు బాధని పంచుకుంటూ భరోసా ఇచ్చిన రైతుబిడ్డ చంద్రబాబు గారి పర్యటనకి తేడాని చూడండి.




మొన్నటి ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకున్న ఉద్యోగులు, ప్రభుత్వ డాక్టర్లు, వృద్దులు, ఎన్నిక...
07/11/2026

మొన్నటి ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకున్న ఉద్యోగులు, ప్రభుత్వ డాక్టర్లు, వృద్దులు, ఎన్నికల సిబ్బంది తదితర వర్గాలు సైతం ఎన్డీయేకే ఓట్లు వేశారు. నాలుగింట మూడొంతుల ఓటర్లు ఎన్డీయేకు మద్దతు తెలుపగా... వైసీపీ వైపు 27 శాతం మందే నిలిచారు. జగన్ హయాంలో ఉద్యోగులకు జరిగిన మోసాలు, అవమానాలే దీనికి కారణం.

07/11/2026

ఇది చాలా గడ్డుకాలం

మొన్నటివరకు ఎల్ నినో, నిన్న అర్నబ్ తుపాను, ఈరోజు మురసు తుపాను. ఎల్ నినో కారణంగా ఈ ఏడాది 53-55 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యింది. అయినా ముందుజాగ్రత్తలు తీసుకోవడం మూలంగా పంటలు మామూలుగానే పండించుకోగలిగాం. తీరా పంట చేతికొచ్చే సమయానికి వరుసగా రెండు తుపానులు వచ్చి రైతులను దెబ్బతీశాయి.



Address

Pathapatnam

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Pathapatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Pathapatnam:

Shortcuts

Share

Nearby government services