09/11/2026
🚔 ప్రశాంతమైన గ్రామాలు.. పారదర్శకమైన ఎన్నికలు.. ప్రజలకు పోలీసుల భరోసా! 🚔
శ్రీ సత్యసాయి జిల్లాలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు పటిష్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు.
👮♂️ జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా పర్యటిస్తున్నారు.
📢 గ్రామసభల ద్వారా ఎన్నికల నియమ నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
🤝 రాజకీయ విభేదాలు, వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉంటూ గ్రామస్తులందరూ సంయమనం పాటించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులకు సహకరించాలని సూచిస్తున్నారు.
⚠️ గ్రామాల్లో గొడవలు, ఘర్షణలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మీ భద్రతే మా బాధ్యత.. ప్రశాంతమైన ఎన్నికలే మా లక్ష్యం!
🚔 శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్