26/08/2026
మేడ్చల్ జిల్లాలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF) మేడ్చల్ డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో హత్యకు గురైన ప్రవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ, కొవ్వొత్తులు వెలిగించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ యొక్క కార్యక్రమంలో టిపిటిఎల్ఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కర్నే సురేందర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేట్ టీచర్లకు, ప్రిన్సిపాల్ లకు, లెక్చరర్స్ కు రక్షణ కల్పించాలని, వీరిపై ఎవరైనా చేయి చేసుకున్న తిట్టిన చట్టరీత్యా చర్య ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రూపా రెడ్డిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాప్రా మండల ఎంఈఓ అజముద్దీన్ గారు మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పానీయాలకు బానిసలు కాకుండా వారి తల్లిదండ్రులు చూసుకోవాలని వారి కర్తవ్యాన్ని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో టిపిటిఎల్ఎఫ్ మండల అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు, ఘట్కేసర్ మండల అధ్యక్షులు బి గణేష్ గారు, జిల్లా నాయకులు నాగరాజు గారు, మురళి గారు, భాగ్యలక్ష్మి గారు, రశ్విత గారు, విజ్ఞాన భారతి కాలేజీ ప్రిన్సిపాల్ పరమేశ్వర్ రెడ్డి గారు, లెక్చరర్ జార్జ్ గారు, భాస్కర్ గారు శ్రీనివాస్ గారు. పుల్లారెడ్డి వర్గం ఆల్ ఇండియా సెక్రెటరీ షేక్ సవాలి గారు, జిల్లా నాయకులు దశరథ్ గారు, బిజెపి నాయకులు జోగారావు, బాబు, నాయకులు సావిత్రి గారు మరియు ప్రైవేటు టీచర్ లెక్చరర్స్ పాల్గొన్నారు.
జవహర్ నగర్, కాప్రా మండలం
21/08/2026.