12/11/2026
మహబూబాబాద్ జిల్లా జనసేన నాయకులు మెరుగు చక్రపాణి గౌడ్, మహమ్మద్ ఆసిఫ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ చేపట్టిన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రచార వాహనం మహబూబాబాద్ పట్టణంలోని నలంద డిగ్రీ, జూనియర్ కళాశాలలను సందర్శించింది.
ఈ సందర్భంగా కళాశాలల అధినేత డోలి సత్యనారాయణ, ప్రిన్సిపల్ గట్ల శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయులను కలిసి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని వివరించి, ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేకల గోపాల్, NK నాయుడు, ముళ్లపాటి చక్రధర్, షేక్ పాషా, భరత్, అశోక్, షేక్ జావిద్, మురళి, షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.