JanaSena Nellorecity

Directions

JanaSena Nellorecity Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JanaSena Nellorecity, Political organisation, Near Sai Baba Temple, Nellore.

నెల్లూరు నగరంలో జనసేన 100% స్ట్రైకింగ్ రేట్ తో గెలిచిన కార్పొరేటర్లకు కిషోర్ గునుకుల అభినందనలు!నెల్లూరు నగర కార్పొరేషన్ ...
09/11/2026

నెల్లూరు నగరంలో జనసేన 100% స్ట్రైకింగ్ రేట్ తో గెలిచిన కార్పొరేటర్లకు కిషోర్ గునుకుల అభినందనలు!

నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసి విజయం సాధించిన JanaSena Party కార్పొరేటర్లు
21వ డివిజన్: విజయలక్ష్మి గునుకుల
29వ డివిజన్: నాగిసెట్టి మురళీకృష్ణ
30వ డివిజన్: నూనె రిషికేశ్ యాదవ్
45వ డివిజన్: చిత్తలూరు సుందరామిరెడ్డి
53వ డివిజన్: శ్రీమతి కొప్పోలు నవ్యలక్ష్మి
6వ డివిజన్: బత్తల శ్రీకాంత్ లను జనసేన నాయకుడు కిషోర్ గునుకుల మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అదేవిధంగా, 15వ డివిజన్ కార్పొరేటర్ కెజియా కుమారి, 71వ డివిజన్ కార్పొరేటర్ షేక్ అలియా అందుబాటులో లేకపోవడంతో వారికి ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేశారు.
నెల్లూరు నగరంలో జనసేన పార్టీ సాధించిన 100 శాతం స్ట్రైకింగ్ రేట్ ఎంతో గర్వకారణమని, ఈ విజయాన్ని పార్టీ అధినేత, Deputy CMO, Andhra Pradesh శ్రీ Pawan Kalyan గారికి అంకితం చేస్తున్నామని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.

భవిష్యత్తులో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలను సమన్వయంతో కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ విజయానికి కృషి చేసిన ప్రతి జనసైనికుడికి, నాయకుడికి, వీర మహిళకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.


జనసేన పార్టీ, నెల్లూరు..

Naga Babu
Nadendla Manohar JanaSena



09/11/2026

జనసేనాని శ్రీ Pawan Kalyan గారి ఆశయాలకు విజయపతాకం… విజయలక్ష్మి గారి గెలుపుతో దీపావళి సైతం విజయోత్సవమైంది!

దీపావళి శుభాకాంక్షలు

చీకట్లను తొలగిస్తూ వెలుగులు నింపే దీపావళి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శ్రీ సంపదలు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మన నాయకులు శ్రీ గారి ఆశీస్సులతో ప్రజాసేవకు లభించిన ఈ అవకాశాన్ని ప్రతి అడుగులోనూ సద్వినియోగం చేసుకుంటూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను.

మీ కుటుంబాల్లో ఆనందాల వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.


JanaSena Party

21వ డివిజన్ కార్పొరేటర్
నెల్లూరు నగరం

Deputy CMO, Andhra Pradesh



07/11/2026

అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ ఒకవైపు… అభివృద్ధిని ఆచరణలో చూపిస్తున్న కూటమి ప్రభుత్వం మరోవైపు!

అభివృద్ధికి ఓటేయాలా? లేక అభివృద్ధిని అడ్డుకునే పాలనకు ఓటేయాలా? అనేది ప్రజలు ఆలోచించాలి.
లో

అభివృద్ధికి కులం లేదు… సంక్షేమానికి ప్రాంతీయ భేదం లేదు… పేదవాడి జీవితంలో భరోసా నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం!

ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను పరిశీలిస్తే ప్రధానంగా మూడు వర్గాల ప్రజలు కనిపిస్తారు.

మొదటి వర్గం – గత 70 సంవత్సరాలుగా అభద్రతలో జీవిస్తున్న నిరుపేద కుటుంబాలు.

వీరు దాదాపు ఏడు దశాబ్దాలుగా వీటిలవాగు గట్టుపై నివసిస్తూ, ఎప్పుడు తమ ఇళ్లను ఖాళీ చేయిస్తారో, ఎప్పుడు తమను అక్కడి నుంచి పంపిస్తారో తెలియని భయంతో జీవితాలు గడిపారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ కుటుంబాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేదు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగి వెళ్లిపోయారే తప్ప, వారి జీవితాల్లో భరోసా నింపే ప్రయత్నం చేయలేదు.

కానీ ఈరోజు ప్రజలు అడగకముందే, వారి సమస్యను గుర్తించి దాదాపు 1,200 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు కల్పించి, వారి కుటుంబాల్లో ధైర్యాన్ని నింపి, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.

ఈ గొప్ప మార్పు వెనుక ప్రధానంగా కృషి చేసిన నాయకులు మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారు.

ఇదే అభివృద్ధికి నిదర్శనం. ఇదే ప్రజా పాలనకు అర్థం. ఇదే పేదవాడి జీవితంలో నిజమైన మార్పు!

మాటలతో కాదు… చేతలతో అభివృద్ధిని చూపిస్తున్న కూటమి ప్రభుత్వం!

07/11/2026

పది సంవత్సరాల క్రితం నాయకులు ప్రజలకు కనిపించేది కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే. కానీ నేడు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. ఈ మార్పుకు స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు.

చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అండగా నిలిచి, రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం నేటి అభివృద్ధికి పునాది అయింది.

అంతేకాదు, **అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని మొట్టమొదటిసారిగా ధైర్యంగా, స్పష్టంగా ప్రకటించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.**

పదవుల కోసం కాదు… రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే నాయకుడు పవన్ కళ్యాణ్!

— కిషోర్ గునుకుల
జనసేన పార్టీ | నెల్లూరు జిల్లా
Courtesy Nellore

జగదీష్ నగర్ పార్కులో విద్యుత్ దీపాల పునరుద్ధరణ చేసిన విజయలక్ష్మి గారు 21వ డివిజన్ కార్పొరేటర్గత మూడు రోజులుగా నిలిచిపోయి...
06/11/2026

జగదీష్ నగర్ పార్కులో విద్యుత్ దీపాల పునరుద్ధరణ చేసిన విజయలక్ష్మి గారు 21వ డివిజన్ కార్పొరేటర్

గత మూడు రోజులుగా నిలిచిపోయిన జగదీష్ నగర్ పార్కులో విద్యుత్ దీపాలను పునరుద్ధరించడం జరిగింది. ప్రస్తుతం ట్రిప్పర్లు అందుబాటులో లేని కారణంగా తాత్కాలికంగా డైరెక్ట్ కనెక్షన్ ద్వారా విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశాము.

మరో రెండు మూడు రోజుల్లో ట్రిప్పర్లను అమర్చి శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తాము.

కార్పొరేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎదురైన తొలి సమస్య పరిష్కారానికి సత్వరమే స్పందించి సహకరించిన సిబ్బందికి, సంబంధిత అధికారులకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు.

21వ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రతి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.


కార్పొరేటర్ – 21వ డివిజన్
నెల్లూరు నగరం

JanaSena Party Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh Dr. Ponguru Narayana JanaSena Shatagni

100% స్ట్రైకింగ్ రేట్ తో నెల్లూరు కార్పొరేషన్ లో జనసేన విజయం... Pawan Kalyan గారి స్ట్రైక్స్ ఎగైన్!పోటీ చేసిన అన్ని స్థా...
06/11/2026

100% స్ట్రైకింగ్ రేట్ తో నెల్లూరు కార్పొరేషన్ లో జనసేన విజయం... Pawan Kalyan గారి స్ట్రైక్స్ ఎగైన్!

పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు.

ఘనంగా JanaSena Party విజయ కేతనం ర్యాలీ

ప్రజల ఆశీర్వాదమే తన బలం... ప్రజాసేవే తన లక్ష్యం... 21వ డివిజన్ అభివృద్ధే తన ప్రథమ కర్తవ్యం అంటూ 21వ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ విజయలక్ష్మి

కార్పొరేటర్,21వ డివిజన్, నెల్లూరు నగరం.

ఇది నెల్లూరు నగర ప్రజలకు శ్రీ గారిపై ఉన్న అపారమైన నమ్మకానికి, నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి శ్రీ Dr. Ponguru Narayana గారి అభివృద్ధి కార్యక్రమాలకు, Kotamreddy Sridhar Reddy గారి ప్రజాసేవకు నిదర్శనం.
జనసేన

నెల్లూరు నగరంలోని 21వ డివిజన్‌లో కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించిన వీర మహిళ గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక గుర్రాలమడుగు సంఘం నుంచి విజయ కేతనం ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

తనను ఆదరించి, ఆశీర్వదించి, ఓట్లు వేసి కార్పొరేటర్‌గా గెలిపించిన 21వ డివిజన్ ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలియజేస్తూ విజయలక్ష్మి ర్యాలీ ద్వారా ప్రజలను నేరుగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఓటరుకు, జనసేన, Telugu Desam Party (TDP) BJP Andhra Pradesh నాయకులకు, కార్యకర్తలకు, కూటమి శ్రేణులకు విజయలక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ ర్యాలీలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ చైర్‌పర్సన్, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ గారి సతీమణి శ్రీమతి అనురాధ గారు, జనసేన నాయకులు కిషోర్ గునుకుల గారితో పాటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో కార్పొరేటర్‌గా అవకాశం కల్పించిన ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, డివిజన్ అభివృద్ధికి కూటమి నాయకుల సహకారంతో కట్టుబడి ఉంటానని తెలిపారు. ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన కూటమి నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Ram Talluri Naga Babu Deputy CMO, Andhra Pradesh Nadendla Manohar JanaSena Shatagni


06/11/2026

100% STRIKING RATE!
నెల్లూరు కార్పొరేషన్‌లో జనసేన ప్రభంజనం!
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘన విజయం!

ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ

21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల

ప్రజల ఆశీర్వాదమే నా బలం… ప్రజాసేవే నా లక్ష్యం!

21వ డివిజన్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా!

కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు.

కిషోర్ గునుకుల | జనసేన పార్టీ


ప్రజాసేవ చేసేందుకు JanaSena Party అధినేత, గౌరవ Deputy CMO, Andhra Pradesh  శ్రీ కొణిదెల శ్రీ Pawan Kalyan గారు మాకు కల్ప...
05/11/2026

ప్రజాసేవ చేసేందుకు JanaSena Party అధినేత, గౌరవ Deputy CMO, Andhra Pradesh శ్రీ కొణిదెల శ్రీ Pawan Kalyan గారు మాకు కల్పించిన ఈ అవకాశాన్ని విజయంగా మలుచుకునే క్రమంలో, మా విజయానికి తన వంతు సహకారం అందించి, ఈ ప్రాంత ప్రజల్లో తనకున్న పరిచయాలు, ప్రభావంతో మాకు అండగా నిలిచి విజయంలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ నాయకులు, నుడా చైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

వారి సహకారం, ప్రోత్సాహం మాకు ఎంతో విలువైనవి


కార్పొరేటర్, 21వ డివిజన్
నెల్లూరు నగరం.

Ram Talluri Naga Babu Nadendla Manohar


05/11/2026

జనసేన పై పొంగూరు నారాయణ గారి కుటుంబం చూపిస్తున్న ఆప్యాయత,అనుబంధం..

నిష్కల్మష మహిళా శక్తి కి అందిన విజయం… మహిళా సాధికారతకు నిలువుటద్దం!

మా యమ్మ రమమ్మ,మా సోదరీమణులు శర్మి, సిందూర నారాయణ, షరణి నారాయణ,అనురాధ,విజేత కూటమి ఆప్యాయతానురాగాల మధ్య ఘన విజయం!

జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించిన మహిళా సాధికారతకు ప్రతిరూపంగా, 21వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఘనవిజయం సాధించిన శ్రీమతి గునుకుల విజయలక్ష్మి గారికి ఆత్మీయ ఆలింగనం చేసి అభినందనలు తెలిపిన మా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, పెద్దల మధ్య ఆనందోత్సాహాలతో విజయోత్సవం వైభవంగా సాగింది.

ఈ ఆత్మీయ వేడుకలో మా రమమ్మ, మా బిడ్డలు, శ్రీమతి సింధూర గారు, శ్రీ షరిణి గారు,రుద్రమలా సౌర్యం చాటిన కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి గారు, మాజీ సర్పంచ్ తాళ్లపాక అనూరాధ గారు, మాజీ జెడ్పీటీసీ విజేత గారు తదితరుల ఆప్యాయత, ఆశీస్సులు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.

మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలో ముందుండాలనే పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా, ఇంతమంది ఆదర్శప్రాయుల స్ఫూర్తిని తీసుకుని, అదే సేవాభావంతో ప్రజల మధ్య ఉంటూ మరింత బాధ్యతగా ముందుకు సాగాలని నా సతీమణి విజయలక్ష్మి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ విజయం ఒక వ్యక్తిది మాత్రమే కాదు… మహిళా శక్తికి, ప్రజల నమ్మకానికి, మహిళా సాధికారతకు దక్కిన గౌరవం!

— కిషోర్ గునుకుల
జనసేన పార్టీ


Address

Near Sai Baba Temple
Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Nellorecity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share