10/11/2026
*గిరిజనులకు అండగా ఆధార్ పార్టీ*
*గిరిజనుల ఉపాధి, భూమి హక్కులు, తండాల మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి*
*గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమేఅమలు చేయాలి*
*రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తాం*
*ఆధార్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ సమావేశంలో డా. ఈడా శేషగిరిరావు*
*ఉప్పెన / డోర్నకల్*: గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, గిరిజనులకు అండగా ఆధార్ పార్టీ నిలుస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా .ఈడా శేషగిరిరావు అన్నారు. తొలుత డోర్నకల్ లో అంబేద్కర్, జగజ్జీవన్ రావ్ ల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.రైతు, గౌడ, ఫిషర్ మ్యాన్, ఎస్సీ వేషధారణ ర్యాలీ పలువురు ఆకర్షణగా తిలకించారు. మంగళవారం మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ నియోజకవర్గ ఆధార్ పార్టీ కార్యకర్తల సమావేశం జైన్ భవన్ లో మూడ్ జ్యోతి నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో శేషగిరిరావు మాట్లాడుతూ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం, సంక్షేమం కోసం ప్రభుత్వం వేసిన ఎస్టీ కమిటీని స్వాగతిస్తున్నామని, అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ ను పూర్తిస్థాయిలో అమలు చేసి, గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, భూమి హక్కులు, తండాల మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని శేషగిరిరావు అన్నారు.ఆధార్ పార్టీ విద్యావంతులైన యువత, మహిళ, వెనుకబడిన వర్గాల ప్రజలకు పోటీ చేసే అవకాశం కల్పిస్తుందని.ఆధార్ పార్టీ ఎప్పుడు పేద ప్రజల పక్షమేనని, వెనుకబడిన వర్గాలకు సమన్యాయం కల్పించి, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ఆధార్ పార్టీ ప్రధాన లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీటికి సరైన ప్రత్యామ్నాయం ఆధార్ పార్టీయేనని ఆయన అన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తి గా ఆధార్ పార్టీని తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు. అట్టడుగు వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2028జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఆధార్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన అన్నారు. త్వరలో జరగబోయే పట్టభద్రల ఎన్నికల్లో బరిలో నిలిచి సత్తా చాటుతాం అన్నారు.
ఈ కార్యక్రమంలోఆధార్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబోజి బుడ్డయ్య,రాష్ట్ర ST సెల్ అధ్యక్షులు అల్లెం వెంకటేశ్వర్లు, రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోడేటి దుర్గాప్రసాద్ గౌడ్, రాష్ట్ర యువత అధ్యక్షులు మున్నా గణేష్ యాదవ్,మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ బానోతు కవిత, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జాటోత్ రఘు వర్మ నాయక్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గట్టు యుగంధర్ గౌడ్, జనగాం జిల్లా అధ్యక్షులు వేముల రమేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంటే కేశవ రావు,ఖమ్మం పార్లమెంటు ఇంచార్జీ తల్లాడ వెంకన్న గౌడ్,ఖమ్మం జిల్లా అధ్యక్షులు కుక్కల నాగేశ్వరరావు, ఖమ్మం టౌన్ అధ్యక్షులు నక్క అజయ్ ,కొత్తగూడెం ఇంచార్జి ప్రేమ్ దయాళ్, భద్రూ నాయక్,మంద హరినాథ్ బాబు,కొప్పుల సునీల్, మూడ్ మోహన్ నాయక్, దారవత్ సునీత, భారత్ నరసింహారావు, దారవత్ వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు