09/11/2026
జగిత్యాలలో కేఆర్ మెస్ & టిఫిన్స్ ప్రారంభించిన డా. బోగా శ్రావణిప్రవీణ్ గారు
జగిత్యాల పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ఎదురుగా BJYM జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు కొండ రవితేజ గారు నూతనంగా ఏర్పాటు చేసిన KR Mess & Tiffins ను బీజేపీ నాయకురాలు డా. బోగా శ్రావణిప్రవీణ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా. బోగా శ్రావణిప్రవీణ్ గారు మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, నాణ్యమైన ఆహారాన్ని, పరిశుభ్రమైన వాతావరణాన్ని వినియోగదారులకు అందిస్తూ వ్యాపారంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, KR Mess & Tiffins మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి,జగిత్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్,SC మోర్చా జిల్లా అధ్యక్షులు నరపాక అశోక్,జిల్లా కార్యదర్శి ముత్యం రెడ్డి,అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి,జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ సిరిపురం శ్రీనివాస్, కౌన్సిలర్లు నిర్మల నాగరాజు, గట్టిపెళ్లి మానస-జ్ఞానేశ్వర్, పవన్ సింగ్, ఇట్యాల రాము,గదాసు రాజేందర్,బోగ నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.