Police Station Kammarpally

Police Station Kammarpally

Share

Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police

27/05/2026
27/05/2026

Ahead of , P. Sai Chaitanya inspected the Satapur cattle market and veterinary checking point to review law & order and cattle transportation arrangements.

Strict action was ordered against illegal transportation and violations.

26/05/2026

బషీరాబాద్ గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పై అవగాహన కార్యక్రమం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు “మన ఊరు – మన భద్రత, మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఈరోజు 26.05.2026న కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు మరియు వాటి ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీ జి. మధుకర్ గారు గ్రామస్థులకు సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. సీసీటీవీ వ్యవస్థలు 24 గంటల పర్యవేక్షణ ద్వారా అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడంలో మరియు నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరిస్తాయని తెలిపారు. గ్రామ ప్రజలు తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా “కమ్యూనిటీ పోలీసింగ్” వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

26/05/2026

🔹 ఒక్క కెమెరా.. వంద మంది పోలీసులతో సమానం – బోధన్‌లో 32 సీసీ కెమెరాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
🔹 పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన పోలీసులు
🔹 వారం రోజుల్లో 162 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
🔹 సాటాపూర్ పశువుల అంగడిని తనిఖీ చేసిన
🔹 అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్యలు

26/05/2026

రైతు సోదరులారా... పంట వ్యర్థాలకు మంట పెట్టకండి!పొలంలో వరి, మొక్కజొన్న వ్యర్థాలను కాల్చడం వల్ల భూమి తల్లి గుండె మండిపోతోంది. నేల సారాన్ని, మీ పంట దిగుబడిని మీ చేతుల్తో మీరే తగ్గించుకోకండి.
మంట వద్దు - మార్పు ముద్దు!

25/05/2026

🚨 వ్యభిచార గృహాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి 🚨

నిజామాబాద్ టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన మెరుపు దాడిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న 7 మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని, 7 మొబైల్ ఫోన్లు మరియు రూ. 4,870 నగదు స్వాధీనం చేసుకున్నారు.

⚠️ అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా, జూదం వంటి చట్ట విరుద్ధ చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయి.

📞 అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.


Telangana State Police

25/05/2026

🌾 ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన నిజామాబాద్ జిల్లా 🌾

రికార్డు స్థాయిలో 6.62 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేసి 96% కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా యంత్రాంగాన్ని మంత్రులు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభినందించారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తూ, కొనుగోలు కేంద్రాల్లో సమన్వయంతో పనిచేస్తున్న అధికార యంత్రాంగానికి ప్రశంసలు లభించాయి.


Telangana State Police

25/05/2026

🚨 శివార్లలో భారీ పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి 🚨

చేపూర్ గ్రామ శివార్లలోని ఫామ్ హౌస్ పై నిర్వహించిన ఆకస్మిక దాడిలో ముగ్గురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

💥 స్వాధీనం:
💰 రూ.18,300 నగదు
🚘 2 కార్లు
📱 3 మొబైల్ ఫోన్లు

జిల్లాలో ఎక్కడైనా జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీసులు హెచ్చరిక.


Telangana State Police

25/05/2026

🔹జిల్లాలో ధాన్యం సేకరణ భేష్ అభినందించిన మంత్రులు, సీఎస్
🔹పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి ముగ్గురు జూదరుల అరెస్ట్
🔹అక్రమ ఇసుక రవాణాపై రుద్రూర్ పోలీసుల చర్య ట్రాక్టర్ పట్టివేత
🔹వ్యభిచార గృహంపై చీతా ఫోర్స్ దాడులు ముగ్గురు అరెస్ట్
🔹ప్రమాదాల నివారణకు డిచ్‌పల్లి ఎస్సై ప్రత్యేక చర్యలు

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Kammarpally
Nizamabad